English | Telugu
నాని హాయ్ నాన్న మూవీ అసలు నిజం ఇదే
Updated : Dec 2, 2023
నాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న తాజా చిత్రం హాయ్ నాన్న. ఈ మూవీ కోసం నాని ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రేక్షకులు కూడా అంతే ఇదిగా ఎదురు చూస్తున్నారు. మొదటి నుంచి సైలెంట్ గా వచ్చి బిగ్గెస్ట్ హిట్ కొట్టడం నాని స్టైల్..పైగా నాని కి ఈ మూవీ 30 వ చిత్రం. ప్యూర్ పాజిటివ్ వైబ్రేషన్ తో రాబోతున్న హాయ్ నాన్న కి సంబంధించిన తాజాగా న్యూస్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది.
తాజాగా హాయ్ నాన్న సెన్సార్ పూర్తి చేసుకుంది. క్లీన్ యూ అందుకున్న హాయ్ నాన్న మూవీ నిడివి మొత్తం 2 గంటల 38 నిమిషాలుగా ఉండబోతుంది. అంటే ఇక నాని అభిమానులకి ప్రేక్షకులకి రెండు గంటల 38 నిమిషాల పాటు పండగే అని చెప్పవచ్చు డిసెంబర్ 7 న పాన్ ఇండియా లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న హాయ్ నాన్న ని వైరా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై చెరుకూరి మోహన్ , విజేందర్ రెడ్డి తీగల ,మూర్తి లు నిర్మించారు. నూతన దర్శకుడు శౌర్యువ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. హేషం అబ్దుల్ వహద్ సంగీతాన్ని అందించాడు.
నాని సరసన సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా మిగతా పాత్రల్లో కైరా కన్నా ,జయరామ్ ప్రియదర్శిని, ఆనంద్ బేడీలు నటిస్తున్నారు. అలాగే ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ అతిధి పాత్రలో మెరవనుంది.