English | Telugu
వెంటవెంటనే పట్టేశారు.. నిజంగా బన్నీది గోల్డెన్ హ్యాండే స్వామీ!
Updated : Aug 25, 2023
ఒక అగ్ర కథానాయకుడు నటించిన రెండు వరుస చిత్రాలు.. వరుస సంవత్సరాల్లో హయ్యస్ట్ గ్రాసర్స్ అవడమంటేనే అదో అరుదైన విషయం. అలాంటిది.. తన వరుస బ్లాక్ బస్టర్స్ తో ఇద్దరు టాలెంటెడ్ పర్సన్స్ ఒకే కేటగిరిలో అవార్డ్స్ పొందడమంటే అది కచ్చితంగా సమ్ థింగ్ స్పెషల్ మ్యాటర్ అనే చెప్పాలి.
ఆ కథానాయకుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాగా.. ఆ టాలెంటెడ్ పర్సన్స్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్స్ థమన్, దేవిశ్రీ ప్రసాద్. తను నటించిన 'అల వైకుంఠపురములో'తో 2020 టాలీవుడ్ హయ్యస్ట్ గ్రాసర్ అందించిన బన్నీ.. మరుసటి సంవత్సరం అంటే 2021లో 'పుష్ప - ది రైజ్'తోనూ అదే బాట పట్టాడు. ఈ రెండు సినిమాలు కూడా సంగీతం పరంగా సంచలనం సృష్టించాయి.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఈ రెండు చిత్రాలతోనే కెరీర్ లో తొలిసారి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా నేషనల్ అవార్డ్స్ కి సెలెక్ట్ అయ్యారు థమన్, దేవిశ్రీ ప్రసాద్. ఆమధ్య 'అల వైకుంఠపురములో'కి గానూ థమన్ మొట్టమొదటిసారిగా జాతీయ పురస్కారంకి ఎంపికైతే.. తాజాగా 'పుష్ప - ది రైజ్'కి గానూ డీఎస్పీ వెరీ ఫస్ట్ టైమ్నేషనల్ అవార్డ్ తీసుకోబోతున్నాడు. మొత్తమ్మీద.. బన్నీ సినిమాల పుణ్యమా అని అటు థమన్, ఇటు దేవిశ్రీ నేషనల్ అవార్డ్స్ కైవసం చేసుకున్నారు. ఈరకంగానూ.. బన్నీది గోల్డెన్ హ్యాండ్ అనే చెప్పాలి. కాగా, 'పుష్ప - ది రైజ్'కి గానూ టాలీవుడ్ తరపున తొలి 'జాతీయ ఉత్తమ నటుడు'గా అల్లు అర్జున్ అవార్డ్ అందుకోబోతున్న సంగతి తెలిసిందే.