English | Telugu
థియేటర్స్‌లో సరే.. ఓటీటీ మాటేమిటి?
Updated : Aug 25, 2023
'గరుడవేగ’ చిత్రంతో ఘనవిజయాన్ని అందుకున్న ప్రవీణ్ సత్తారు ఆ తర్వాత నాగార్జునతో చేసిన ‘ది ఘోస్ట్’ చిత్రంతో నిరాశపరిచాడు. మరో ప్రయత్నంగా వరుణ్‌తేజ్, సాక్షివైద్య జంటగా చేసిన ‘గాండీవధారి అర్జున’ చిత్రంపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితం సాధించలేకపోయింది. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్స్‌కి వెళ్ళిన ఆడియన్స్‌కి నిరాశే మిగిలింది.
థియేటర్స్‌లో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రాకపోయినా ఓటీటీలో విజయవంతమైన సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ సినిమాకి కూడా అదే జరుగుతుందని భావిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ ద్వారా ప్రతి ఇంటికీ చేరనుంది. మరి థియేటర్స్‌కి రాని ప్రేక్షకుల్ని ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.