English | Telugu

నేను ఇల్లు కట్టుకోవడానికి ప్రదీప్ సాయం చేసాడు..కాబట్టే నాకు పెళ్లయ్యింది

జీ తెలుగు ఇటీవల వాలెంటైన్స్ డేని పురస్కరించుకుని "ఓ రెండు ప్రేమ మేఘాలు" అనే క్యూట్ ఎపిసోడ్ ని ప్రసారం చేసింది. ఇందులో విశ్వా-శ్రద్దా జోడి వచ్చారు. అన్నీ రకాల గేమ్స్ లో పార్టిసిపేట్ చేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసారు. "జీ తెలుగుతో చాలా అనుబంధం వుంది విశ్వాకి ..శ్రద్దాకు ఆరో నెల నడుస్తోంది. ఐనా మేము చెప్పగానే వస్తాను అని చెప్పింది" చాలా థ్యాంక్స్ అని ప్రదీప్ వాళ్ళ గురించి చెప్పాడు. అలా ఈ షోకి వచ్చిన లేడీస్ అందరినీ స్టేజి మీదకు ఇన్వైట్ చేసి శ్రద్దాకు చిన్న సైజు సీమంతం వేడుక చేశారు. గాజులు, పూలు, చీర ఇచ్చి అక్షింతలు వేసి అందరూ ఆశీర్వదించారు. "ముందు పెళ్లి చేయాలి అంటే పిల్లనిచ్చే ఏ తల్లితండ్రులైనా సరే అబ్బాయికి ఇల్లుందా అని చూస్తారు..కానీ మా ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములం..ఇల్లు కట్టాలంటే నాలుగు పిల్లర్లు కావాలి. మరి అప్పటికి మూడు పిల్లర్లే ఉన్నాయి.

అప్పుడు నాలుగో పిల్లర్లా వచ్చి నిలబడ్డాడు ఆ దేవుడిచ్చిన బ్రదర్..ఆ డార్లింగ్ నా పక్కన నిలబడ్డాడు కాబట్టే నేను అప్పుడు ఇల్లు తీసుకోగలిగాను. ఆ ఇల్లు కట్టుకున్నాకే శ్రద్దా వాళ్ళ ఫామిలీ మా ఇంటికి వచ్చి ఆమెను నా చేతిలో పెట్టారు. ఆ దేవుడు ఇచ్చిన బ్రదర్ ఈ స్టేజి మీద ఉన్నాడు..అతను మరెవరో కాదు అంటూ ప్రదీప్ ని పిలిచి గట్టిగా హగ్ చేసుకున్నాడు..నేను ఇప్పటివరకు ఎవ్వరి బ్లెస్సింగ్ తీసుకోలేదు..కానీ ఈరోజు నేను ప్రదీప్ బ్లెస్సింగ్ తీసుకుంటున్నా అని కాళ్ళు పట్టుకున్నాడు" విశ్వ " ఫ్యూచర్ లో మీ ఆవిడకు కూడా మేమే సీమంతం చేస్తాం" అని హరిత ప్రదీప్ తో అనేసరికి అందరూ నవ్వేశారు .."మీరు కాకపొతే ఇంకెవరు చేస్తారమ్మా" అన్నాడు ప్రదీప్..."మా పట్టుచీరలన్నీ అలా పెండింగ్ లో ఉండిపోతున్నాయి అని హరిత అనేసరికి పట్టుచీర కోసం పెళ్లి చేసుకోవడం బాగోదు కదా " అన్నాడు ఫన్నీగా ప్రదీప్.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .