English | Telugu
అందమైన జంట ఐష్, జాన్
Updated : Jul 9, 2014
2010 గుజారిష్ తర్వాత సినిమాల్లో కనిపించని ఐశ్వర్యా రాయ్ నటిస్తున్న చిత్రం జజ్బా. తల్లి అయిన తర్వాత ఐశ్వర్య నటిస్తున్న ఈ చిత్రం గురించి ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంజయ్ గుప్తా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మిగతా తారాగణం గురించిన వివరాలేవి ఇప్పటి వరకూ ప్రకటించలేదు. తాజాగా ఈ చిత్రంలో ఒక పాత్ర కోసం జాన్ అబ్రహంను సంప్రదించినట్లు కథనాలు వస్తున్నాయి. మాఫియా డాన్ తరహా పాత్రలో జాన్ కనిపించే అవకాశం వుంది.
ఆడవారు ఎక్కువగా అభిమానించే హీరోలలో ఒకరైన జాన్, అందాన్ని ఆరాధించే ఎంతోమందికి ఆరాధ్యదేవత అయిన ఐశ్వర్య ఈ చిత్రంలో కలిసి కనిపించనున్నారు. ఈ చిత్రంలో వీరిద్దరూ మొదటిసారి కలిసి నటించబోతున్నారు. ఈ విషయం గురించి మాట్లాడుతూ, ఐశ్వర్యతో కలిసి నటించడం తనకు ఎంతో ఆనందంగా వుందన్నారు జాన్ అబ్రహం. ఇంతకీ మరో ముఖ్య విషయం ఏంటంటే, అన్నీ సజావుగా సాగితే ఈ చిత్రం ఈ ఏడాది చివరలో మొదలుకావచ్చు.