English | Telugu
గోపాల గోపాలలో పవన్ గోపెమ్మ ప్రియమణి
Updated : Jul 9, 2014
చాలాకాలంగా టాలీవుడ్‌లో ప్రియమణి కనిపించలేదు. అసలు ఆమె పేరు కూడా వినిపించలేదు. ఇప్పుడు ఎలా జరిగిందో కాని గోపాల గోపాలలో పవన్ తో కలిసి ప్రియమణి కనిపించబోతోందంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. బాలీవుడ్ సినిమాలో షారుఖ్ ఖాన్ పక్కన ఐటం సాంగ్ లో కనిపించిన ప్రియమణి ఆ తర్వాత ఇక్కడి న్యూస్ లో ఎక్కడా కనిపించలేదు. అయితే గోపాల గోపాల చిత్రం కోసం పవన్ ఏరికోరి ప్రియమణిని ఎంపిక చేసినట్లు చెప్పుకుంటున్నారు. దాదాపు పదేళ్లుగా దక్షిణాది అన్ని భాషల్లో నటించిన ప్రియమణి ఈ చిత్రంలో ఏ పాత్రలో కనిపించనుందో ఇంకా తెలియాల్సి వుంది.
ఓ మై గాడ్ హిందీ చిత్రానికి రీమేక్ గా వస్తున్న గోపాల గోపాల చిత్రం టాలీవుడ్ లో ప్రముఖమైన విషయం కాగా, ఇప్పుడు ఈ ప్రాజెక్టులో ప్రియమణి ఎంట్రీ మరింత ఇంట్రస్టింగ్ అంశంగా మారింది.