English | Telugu
సల్మాన్ ఖాన్‌కు సుప్రీంకోర్టు నోటీసు
Updated : Jul 10, 2014
సల్మాన్ ఖాన్‌కు కృష్ణ జింకను వేటాడిన కేసులో సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ఆ కేసులో కోర్టు విధించిన శిక్షపై ఇచ్చిన స్టేను ఎందుకు తొలగించకూడదో సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు బుధవారం బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు నోటీసులు జారీ చేసింది. పదహారేళ్లుగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కృష్ణ జింక వేట కేసు విషయంలో కోర్టుల చుట్టు తిరుగుతున్నారు. 1998 అక్టోబర్ 1-2 తేదీల రాత్రి రాజస్థాన్లో జోధ్‌పూర్ సమీపంలోని మథానియా, కంకణిలో కృష్ణజింకలను వేటాడినట్లు సల్మాన్ ఖాన్‌పై రెండు కేసులు నమోదయ్యాయి. హమ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగ్ సందర్భంలో సల్మాన్ ఖాన్ ఒక కష్ణజింకను, రెండు చింకారా జింకలను వేటాడినట్టు అభియోగాలున్నాయి. ఈ కేసులో ఆ సినిమాలో సహ నటులైన సైఫ్ అలీఖాన్, సోనాలీ బింద్రే, టబు, నీలం కూడా నిందితులుగా ఉన్నారు. జస్టిస్ ఎస్‌జె ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ధర్మాసనం సల్మాన్ ఖాన్‌కు నోటీసులు జారీ చేస్తూ నాలుగు వారాలలో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది