English | Telugu
భయపెడుతున్న రౌడీ మోహన్ బాబు
Updated : Feb 20, 2014
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో మోహన్ బాబు, విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న "రౌడీ" చిత్ర ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. ఇందులో మోహన్ బాబు కొత్త గెటప్ లో భయపెట్టడానికి సిద్ధమవుతున్నాడు. ఈ ఫస్ట్ లుక్ చుస్తే మోహన్ బాబు మాస్ తరహ పాత్రలో అదరగొడుతున్నాడు. విష్ణు కూడా రఫ్ గా కనిపిస్తున్నాడు. ఇందులో జయసుధ, శాన్వి కథానాయికలుగా నటిస్తున్నారు. యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పార్థసారథి, గజేంద్ర, విజయ్ కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.