English | Telugu
అర్జున్ కూతురు పెళ్లికూతురాయెనే!
Updated : Jun 26, 2023
అర్జున్ సర్జా కూతురు పెళ్లి కుదిరింది. ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్ త్వరలోనే పెళ్లి కూతురు కాబోతున్నారు. ఉమాపతి రామయ్యను ఆమె వివాహం చేసుకోనున్నారు. నేషనల్ అవార్డు గ్రహీత తంబి రామయ్య కుమారుడే ఉమాపతి రామయ్య. పలు డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగువారికి కూడా పరిచయస్తులు తంబి రామయ్య. ఐశ్వర్య అర్జున్, ఉమాపతి రామయ్య గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న పెద్దలు వారిద్దరికీ వివాహం చేయడానికి నిర్ణయించుకున్నారు. త్వరలోనే ఈ పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.
2013లో ఐశ్వర్య అర్జున్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. పట్టత్తు యానై అనే సినిమాలో విశాల్‌తో కలిసి నటించారు. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించారు. కానీ ఆమెకు అనుకున్నంత సక్సెస్ రాలేదు. తెలుగులోనూ విశ్వక్‌సేన్ తో ఓ సినిమా చేయాలని అనుకున్నారు. అయితే అది కుదరలేదు. ఉమాపతి కూడా నటుడే. 2017లో అదాగపట్టదు మగాజనంగలే సినిమాలో నటించారు. అతనితో తంబిరామయ్య కూడా ఓ సినిమా చేశారు. మణియార్ కుటుంబం అనే ఆ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలుసుకున్న ఐశ్వర్య, ఉమాపతి ప్రేమలో పడ్డారంటోంది కోలీవుడ్.