English | Telugu
మణిరత్నం సినిమాలో శింబు
Updated : Jun 26, 2023
మణిరత్నం దర్శకత్వంలో కమల్‌హాసన్ ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 1987లో వీరిద్దరూ కలిసి నాయకుడు చేశారు. ఆ తర్వాత వీరి కలయికలో రానున్న చిత్రమిది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడానికి శింబుని అప్రోచ్ అయ్యారట. ఆయన కూడా ఓకే చెప్పారన్నది న్యూస్. శింబుకి మణిరత్నం దర్శకత్వంలో నటించడం కొత్తేమీ కాదు. గతంలో ఆయన చెక్కచెవంద వానమ్‌లో నటించారు. ఈ సినిమాలో అరవింద్ స్వామి, జ్యోతిక, అరుణ్ విజయ్, శింబు, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్, జయసుధ, అదితిరావు హైదరీ, ఐశ్వర్య రాజేష్ నటించారు. అందరిలోకీ శింబుకి చాలా మంచి పేరు వచ్చింది.
దాన్ని దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు కమల్ సినిమాలో కేరక్టర్‌కి శింబు అయితే పక్కాగా సరిపోతారని, ఆయన్ని సెలక్ట్ చేశారట మణిరత్నం. ఇప్పటిదాకా శింబు కెరీర్‌లో ఇలాంటి పాత్ర చేయలేదట. కమల్‌హాసన్ ప్రస్తుతం ప్రాజెక్ట్ కె పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ వెంటనే ఇండియన్2ని కంప్లీట్ చేయాలి. మధ్యలో తన ప్రొడక్షన్‌లో వచ్చే ప్రాజెక్టుల సంగతి చూడాలి. ఓ వైపు మణిరత్నం సినిమా కోసం ప్రిపేర్ కావాలి. ఇంత హెక్టిక్‌లో లైఫ్ చాలా బావుందని అంటున్నారట కమల్‌హాసన్. మరి బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్‌ని కమల్ హోస్ట్ చేస్తారా? లేదా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు తమిళ తంబిలు.