English | Telugu

బాలీవుడ్ విలక్ష‌ణ న‌టునిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తోన్న భార్య‌!

బాలీవుడ్‌లో బహుముఖ ప్రజ్ఞాశాలి అని తగ్గ నటుడు ఎవరైనా ఉన్నారంటే విల‌క్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి పేరు చెప్పాలి. ఈయ‌న త్వ‌ర‌లో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమవుతున్నారు. హిట్ ఫ్రాంచైజీ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన బోయే ప్రతిష్టాత్మక 75వ చిత్రం సైంధవ్ లో నవాజుద్దీన్ సిద్ధికి విలన్ పాత్రను పోషిస్తున్నారు. ఈయనకు నటునిగా ఊపిరి పీల్చుకోవడానికి కూడా తీరిక లేనటువంటి బిజీ ఆర్టిస్ట్. తాజాగా ఆయన భార్య ఆయనపై తీవ్ర ఆరోపణలు చేసింది. నవాజుద్దీన్ సిద్ధికి భార్య అలియా సిద్ధికి భర్త తనను ఇంట్లో వేధిస్తున్నాడని అతని కుటుంబ సభ్యులపై కేసులు నమోదవుతున్నాయని తన లాయర్ ద్వారా వెల్లడించింది.

నవాజుద్దీన్ అతని కుటుంబ సభ్యులు తన క్లైంట్కు తిండి పెట్టడం లేదని మంచం పై చోటు ఇవ్వలేదని అలాగే బాత్రూంకి కూడా వెళ్ళనివ్వలేదని ఆలియా తరపు న్యాయవాది ఆరోపిస్తున్నారు. అనేకమంది మగ అంగరక్షకులతో సెక్యూరిటీని ఏర్పరిచారు. నా క్లైంట్ ప్రస్తుతం మైనర్ పిల్లలతో ఉంటుంది. ఆమె ఉంటున్న హాల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చారు. అలియా నిరాడంబరతను పోలీస్ అధికారుల ముందు అవమానించారు. మైనర్ కొడుకు చట్టబద్ధతను ప్రశ్నించారు అని ఆమె తరుపున న్యాయవాది ఆరోపణలు చేశారు.

నవాజ్ తమ స్వగృహంలోనే ఆమెను వేధించాడు. ఇంటి నుండి గెంటేసేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రతి కదలికను నియంత్రించారు అంటూ దీర్ఘ ప్రకటనలో అవమానాల పర్వం గురించి వివరించారు. ఇంకా ఆలియా తరపు న్యాయవాది మాట్లాడుతూ మిస్టర్ నవాజుద్దీన్ సిద్ధికి అతని కుటుంబ సభ్యులు ఆలియాను ఇంటి నుండి గెంటేసేందుకు ఎందుకు ప్ర‌య‌త్నం చేశారు. వారు ఆమెపై అక్రమ ఆస్తులు కలిగి ఉందని నేరారూపణను దాఖలు చేశారు. ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేసి వారు ఆమెను అరెస్టు చేయిస్తామని బెదిరించారు. ప్రతిరోజు సూర్యాస్తమయం తరువాత ఆమెను పోలీస్ స్టేషన్‌కు పిలుస్తున్నారు అని లాయర్ పేర్కొన్నాడు. మరి ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.