English | Telugu
సమంతను ఫాలో అవుతున్న కియారా... సోషల్ మీడియాలో అలా చేశారా?
Updated : Feb 12, 2023
బాలీవుడ్ యాక్టర్స్ కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా చేసిన పనికి ఇప్పుడు నెట్టింట్లో గట్టిగా వైరల్ అవుతున్నారు. వైరల్ న్యూస్ అనగానే అదేదో చెడుగా అనుకోవాల్సిన అవసరం లేదు. పాజిటివ్‌గానే. పెళ్లి తర్వాత వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో డీపీలను మార్చారు. అది కూడా ఇద్దరూ పెళ్లి ఫొటోలను షేర్ చేశారు. ఒకరికొకరు నమస్కారం చేసుకుంటున్నట్టు ఉన్న ఫొటోలను సిద్ధార్థ్ షేర్ చేయగా, తన బుగ్గపై సిద్ ముద్దు పెడుతున్నట్టున్న ఫొటోలను కియారా షేర్ చేశారు. షేర్‌షా సినిమాలో కలిసి నటించిన వీరిద్దరూ ఫిబ్రవరి 7న జైసల్మేర్‌లోని సూర్యఘడ్ ప్యాలస్‌లో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. బాలీవుడ్ సెలబ్రిటీలు కరణ్‌జోహార్,మనీష్ మల్హోత్రా, జూహీ చావ్లా, షాహిద్ కపూర్, పృథ్విరాజ్ సుకుమారన్ కపుల్ తో పాటు పలువురు ఈ వేడుకకు హాజరయ్యారు. పెళ్లికి వెళ్లలేకపోయినందుకు బాధపడుతూ సారీ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ఉపాసన కొణిదెల కామినేని.
పెళ్లి తర్వాత సిద్ కియారా కలిసి ఢిల్లీలో పార్టీ ఇచ్చారు. ఆదివారం ముంబైలో రిసెప్షన్ ఇచ్చారు. ఇద్దరూ కలిసి కొత్తగా ముంబైలో కొనుగోలు చేసిన ఫ్లాట్‌లోకి షిఫ్ట్ అయ్యారు. సిద్ధార్థ్ ఇటీవల మిషన్ మజ్ను సినిమాలో నటించారు. ఈ సినిమాలో రష్మిక మందన్న నాయికగా నటించారు. కియారా అద్వానీ చేతిలో నార్త్ ప్రాజెక్టులతో పాటు ప్రస్తుతం రామ్‌చరణ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఆల్రెడీ రామ్‌చరణ్ తో కలిసి వినయవిధేయరామాలో నటించారు కియారా. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఇప్పుడు రామ్‌చరణ్‌తో నటిస్తున్న ఈ సినిమా పెద్ద బ్రేక్ ఇవ్వాలని, శంకర్ హీరోయిన్‌గా సౌత్‌లో జండా పాతాలని అనుకుంటున్నారు భరత్ అనే నేను హీరోయిన్. అన్నట్టు నాగచైతన్యతో పెళ్లయిన వెంటనే సమంత కూడా ముందు ఇన్‌స్టాలోనే పేరు మార్చుకున్నారు. ఇప్పుడు కియారా కూడా ఇన్‌స్టా డీపీ మార్చారు.