English | Telugu
‘ఆదిపురుష్’ నుంచి హైఓల్టేజ్ సాంగ్!
Updated : Feb 27, 2023
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ఆది పురుష్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో రాముడిగా నటిస్తున్నారు. కృతి సనన్ . హీరోయిన్‌గా అంటే సీత పాత్రలో నటిస్తోంది.సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రం రామాయణం ఆధారంగా రూపొందుతోంది. సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. సినిమా నుంచి టీజర్ కూడా విడుదలయ్యింది. కానీ ఈ టీజర్ పై ఎన్నడూ లేని విధంగా నెగెటివిటీ వచ్చింది. రామాయణం కథని అందులోని పాత్రలను వక్రీకరించి ఈ సినిమా తీశారని పలువురు మండిపడ్డారు. పాత్ర చిత్రీకరణ కూడా సరిగా లేదని ఆక్షేపించారు. హిందుత్వ సంఘాలు కూడా ఈ చిత్రానికి వ్యతిరేకంగా గళం విప్పాయి.
సినిమా విడుదల అయితే సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించాయి. దాంతో సినిమా విడుదలను వాయిదా వేశారు సంక్రాంతి నుండి జూన్ 16 కు పోస్ట్ పోన్ చేశారు. మరలా విజువల్ ఎఫెక్ట్స్ పై 100 కోట్ల బడ్జెట్ కేటాయించి మార్పులు చేర్పులు చేస్తున్నారు. మెజార్టీ బాగా పూర్తయింది. రిలీజ్ డేట్ లో కూడా ఎలాంటి మార్పు ఉండదు. ఈ చిత్రం నుంచి ఓ హై వోల్టేజ్ సాంగ్ ను వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాని వీలైనంత ఎక్కువ భాషల్లో రిలీజ్ చేయడానికి టి సిరీస్ ప్లాన్ చేస్తోంది. ప్రేక్షకులు కోరుకునే నవరసాలు ఈ చిత్రంలో అద్భుతంగా ఉంటాయని అంటున్నారు.
దర్శకుడు 90 సెకండ్ల నిడివి కలిగిన వీడియోని చూసి సినిమాను జడ్జి చేయకూడదు అంటున్నారు. ఆయన ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అవుతుందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎంతమందిని ఆకట్టుకుంటుందో వేచిచూడాలి. ఆది పురుష్ పై వచ్చినంత నెగెటివిటీ ఈ మధ్యకాలంలో వాస్తవానికి ఈ తరంలోనే వచ్చి ఉండకపోవచ్చు. మరి అంత నెగటివిటీ ఎదుర్కొన్న ఈ చిత్రం సినిమా పరంగా మెప్పిస్తే అది పెద్ద గ్రేట్ అచీవ్మెంట్ అవుతుంది.