English | Telugu

'ఉస్తాద్ భగత్ సింగ్'లో శ్రీలీల!

టాలీవుడ్ లో ప్రస్తుతం యంగ్ బ్యూటీ శ్రీలీల పేరు మారుమోగుతోంది. ఇటీవల 'ధమాకా'తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ అమ్మడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఆమె అందానికి, డ్యాన్స్ లకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే శ్రీలీల చేతిలో 'ssmb 28', 'nbk 108', 'నితిన్ 32', బోయపాటి-రామ్ మూవీ వంటి ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీ ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం దక్కించుకున్నట్లు న్యూస్ వినిపిస్తోంది.

'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తరువాత పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రానున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. తమిళ్ మూవీ 'తేరి'కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. సెకండ్ హీరోయిన్ గా శ్రీలీలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న 'ssmb 28'లో సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుండగా.. ఇప్పుడు పూజా హెగ్డే నటిస్తున్న మరో సినిమాలో శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ కాంబినేషన్ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.