English | Telugu
ఆంటీ అంటే తప్పేనంటుంది!
Updated : Feb 27, 2023
ఈ మధ్యకాలంలో అనసూయని సోషల్ మీడియాలో ఒక నెటిజన్ ఆంటీ అని సంబోధించారు. ఆమె సీరియస్ అయ్యింది. ఆంటీ అని పిలిస్తే కేసు పెడతానని వార్నింగ్ ఇచ్చింది.. నాటి నుంచి ఆంటీ అనే మాట వైరల్ అయింది. పెద్ద వయసు ఉన్న పెళ్లయిన మహిళని ఆంటీ అని సంబోధించడం కామన్ కదా....! అని వాదించేవారు ఉన్నారు. కానీ వయసొచ్చిన కుర్రాళ్ళు అంటే మాత్రం కచ్చితంగా తప్పేంటోంది సీనియర్ హీరోయిన్ కస్తూరి. ఈమె మాట్లాడుతూ చిన్నపిల్లలు ఆంటీ అంటే పర్వాలేదు కానీ ఎద్దులా ఉన్న కుర్రాళ్ళు ఎవరైనా మహిళలని ఆంటీ అని పిలిస్తే దానికి వేరే అర్థం వస్తుంది. హీరోలని ఎవరు అంకుల్ అని పిలవరు.
సో వయసు ఎక్కువ ఉన్న హీరోయిన్లను కూడా ఆంటీ అనడానికి వీలు లేదు. దానికి డర్టీ మీనింగ్ వచ్చేసింది. అలా పిలిస్తే ఖచ్చితంగా తప్పే అవుతుంది అని అనసూయకు తన మద్దతు తెలిపింది ఇక ఈమె తెలుగులోకి గ్యాంగ్ వార్ అనే చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత బాలకృష్ఱ నిప్పురవ్వ, గాడ్ ఫాదర్, సోగ్గాడిపెళ్లాం, మెరుపు, రెండు కుటుంబాల కథ, చిలక్కొట్టుడు, రథయాత్ర, అన్నమయ్య, మా ఆయన బంగారం, ఆకాశవీధిలో, గుడుగుడుగుంజం, డాన్ శ్రీను, శమంతకమణి,గాడ్ ఫాదర్ వంటి చిత్రాలలో నటించింది.