English | Telugu
వృషభ షూటింగ్ స్పాట్‌లో ఊహ
Updated : Jul 24, 2023
వృషభ షూటింగ్ స్పాట్‌లో కనిపించారు నటి ఊహ. శ్రీకాంత్ సతీమణి కూడా ఈ సినిమాలో నటిస్తున్నారా? అంటూ ఊహల్లోకి వెళ్లినవారు కూడా ఉన్నారు. అయితే ఆమె తనయుడు రోషన్ ఈ మూవీలో కీ రోల్ చేస్తున్నారు. ఈ ప్యాన్ ఇండియన్ మూవీలో శ్రీకాంత్, ఊహ తనయుడు రోషన్, మోషన్‌లాల్ కొడుకుగా నటిస్తున్నారు. ఈ సినిమా ముంబైలో స్టార్ట్ అయింది. దీని గురించి మోహన్‌లాల్ సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. ``వృషభ ఫస్ట్ స్టెప్ వేసింది. ఫ్రేమ్స్ వైపు కదులుతోంది మూవీ. క్లాప్ బోర్డ్ సౌండ్ పడ్డ క్షణం నుంచి మీ ఆశీస్సులు, ప్రేమను ఆశిస్తోంది మా టీమ్`` అంటూ పోస్ట్ పెట్టారు మోహన్‌లాల్.
ఊహ క్లాప్ కొట్టిన ఫొటోను కూడా ఆయన షేర్ చేసుకున్నారు. ఈ సినిమాతోనే సంజయ్ కపూర్, మహీప్ కపూర్ తనయ షనాయా కపూర్ హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. కనెక్ట్ మీడియా, ఏవీయస్ స్టూడియోస్‌తో కలిసి ఏక్తా ఆర్ కపూర్ బాలాజీ టెలీ ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. డ్రామా, యాక్షన్, గ్లామర్‌తో నిండిన ఎపిక్ సగా వృషభ. ఈ సినిమాతోనే షనాయా హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. రోషన్ మేకతో ఆమె జోడీకడుతున్నారు. నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. 2024లో ఈ సినిమాను విడుదల చేయాలన్నది మేకర్స్ ప్లాన్. మలయాళం, తెలుగు, కన్నడ, తమిళ్, హిందీలో తెరకెక్కించనున్నారు. కొడుకు సినిమా ఓపెనింగ్‌కి హాజరై, క్లాప్ కొట్టారు నటి ఊహ.