English | Telugu
చంద్రముఖి 2 లేటెస్ట్ అప్‌డేట్
Updated : Jul 24, 2023
చంద్రముఖి 2 గురించి లేటెస్ట్ అప్‌డేట్ ఆడియన్స్ ని ఊరిస్తోంది. ఈ అప్‌డేట్‌కి ఆస్కార్ విన్నర్‌కీ లింక్ ఉందన్నది స్పెషల్ న్యూస్. అకాడమీ విన్నర్ ఎం.ఎం.కీరవాణి చంద్రముఖి2 కోసం పనులు ప్రారంభించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు మొదలయ్యాయి. వచ్చే నెల్లో ఫస్ట్ సింగిల్‌ని లాంచ్ చేయాలన్నది మేకర్స్ ప్లాన్. దాన్ని కూడా అత్యంత భారీ వేడుకగా నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత అఫిషియల్‌గా మ్యూజిక్ డైరక్టర్‌గా కీరవాణి పాల్గొనే వేదిక ఇదే అవుతుంది కాబట్టి, భారీ ఎత్తున సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారట మేకర్స్.
లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఏడాది పొడవునా, తమ సినిమాలకు సినీ అభిమానులకు స్వీట్ సర్‌ప్రైజ్ ఇస్తూనే ఉంది లైకా ప్రొడక్షన్స్. ఇప్పుడు అదే క్యూలో చంద్రముఖి2ని ఇంక్లూడ్ చేసేసింది. చంద్రముఖి 2 సినిమా షూటింగ్ ఆల్రెడీ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాఘవలారెన్స్ డబ్బింగ్ పనులు పూర్తి చేశారు. పి.వాసు దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న 65వ సినిమా ఇది. బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. వైగై పుయల్ వడివేలు, మహిమ నంబియార్, లక్ష్మీ మీనన్, సృష్టి, రావు రమేష్, విఘ్నేష్, రవి మారియా, సురేష్ మీనన్, సుభిక్ష కృష్ణన్ ఇతర కీలక పాత్రల్ల నటిస్తున్నారు.
తోట తరణి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేశారు. ఆంటనీ కెమెరా హ్యాండిల్ చేశారు. హారర్ కామెడీ జోనర్ మవీ ఇది. గ్రాండ్ స్కేల్‌లో తెరకెక్కించారు. చంద్రముఖి కాన్సెప్ట్ కి మన దగ్గర స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు. అలాంటివారిని మరోసారి సర్‌ప్రైజ్ చేయాలని ఈ సినిమాను తెరకెక్కించామని అన్నారు లైకా ప్రొడక్షన్స్ హెడ్ తమిళ్ కుమరన్. వినాయక చవితి స్పెషల్‌గా సెప్టెంబర్ 15న విడుదల కానుంది చంద్రముఖి2 అని చెప్పారు.