English | Telugu
షాక్ ఇస్తున్న కోటబొమ్మాళి పిఎస్ ఫస్ట్ డే కల్లెక్షన్స్
Updated : Nov 25, 2023
మైటీ స్టార్ శ్రీకాంత్ ,వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో రాహుల్ విజయ్ ,శివాని రాజశేఖర్ లు నటించిన కోటబొమ్మాళి పిఎస్ నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. జి ఏ 2 బ్యానర్ పై అల్లు
అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది. ఈ సినిమా సాధించిన మొదటి రోజు కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.
ఈ చిత్రం మొదటి రోజు 1.75 కోట్ల గ్రాస్ ని సాధించింది. మార్నింగ్ షోస్ కి ఆడియన్స్ ఒక మాదిరిగా ఉన్నా మాట్నీ షోస్ నుంచి కోటబొమ్మాళి మంచి పికప్ ని అందుకుంది. మూవీ చూసిన ప్రతి ఒక్కరు
కూడా మూవీ చాలా బాగుందని ఇంకో ఇద్దరికీ చెప్తున్నారు. దీంతో ఈ చిత్రం వీకెండ్స్ లో బాగా కలెక్షన్స్ ని రాబట్టే అవకాశం ఉంది .ఇది ఇలాగే కొనసాగితే జి ఏ 2 బ్యానర్లో మరొక హిట్ గా కోటబొమ్మాళి
నిలవడం ఖాయం.
ఒక కేసులో చిక్కుకున్న పోలీసులు కి సాటి పోలీసు డిపార్ట్ మెంట్ నుంచి, రాజకీయ నాయకుల నుంచి అలాగే ప్రజల నుంచి ఏర్పడిన ఇబ్బందుల వల్ల ఆ పోలీసుల జీవితాలు ఎలా నాశనం అయ్యాయి అనే ఇతివృతంతో కోటబొమ్మాళి రూపుదిద్దుకుంది. శ్రీకాంత్ అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ ల నటన ఈ చిత్రానికి ప్రధాన హైలెట్ గా నిలిచింది.మినిస్టర్ క్యారక్టర్ లో మురళి శర్మ సూపర్ గా నటించాడు.తేజ మార్నిదర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి రంజిన్ రాజ్ సంగీతం అందించగా నాగేంద్ర కాశి మాటలని అందించాడు .