English | Telugu
రికార్డ్స్ బ్రేక్స్ చేసిన మహేష్
Updated : Feb 3, 2014
మహేష్ నటిస్తున్న తాజా చిత్రం "ఆగడు" చిత్రం విడుదలకు ముందే రికార్డులను బ్రేక్ చేస్తుంది. ఓవర్ సీస్ లో మహేష్ నటించిన "1" కు భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది. దాంతో మహేష్ నటిస్తున్న "ఆగడు" సినిమా ఓవర్ సీస్ హక్కుల కోసం భారీ పోటీ పెరిగింది. అయితే ఇటీవలే ఈ చిత్ర యూఎస్ హక్కులను రికార్డు స్థాయిలో 6కోట్లకు ఓ ఫైనాన్సియర్ కొనుగోలు చేసాడు. "దూకుడు" వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత శ్రీనువైట్ల, మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. 14 రీల్స్ బ్యానర్లో అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మహేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.