English | Telugu
నేను గర్భవతిని కాదు: కరీనా
Updated : Feb 1, 2014
గతకొద్ది రోజులుగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ గర్భవతి అంటూ పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పుకార్లను విని, విని విసుగెత్తిపోయిన కరీనా చాలా ఆవేశంగా స్పందించింది."ప్రస్తుతం నా చేతిలో చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు ఉన్నాయి. కొన్ని వ్యాపార ప్రకటనల్లో కూడా నటిస్తున్నాను. ఇలాంటి సమయంలో ఈ రూమర్లు రావడం నా నిర్మాతల్ని భయాందోళనలకు గురి చేసే ప్రమాదం ఉంది. అందుకే వివరణ ఇస్తున్నను. నేను గర్భవతిని కాదు. ఇప్పుడే తల్లిని కావాలని నాకు లేదు. ఇప్పటికే సైఫ్ కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు నా పిల్లలే. వారి నుంచే తల్లి ప్రేమను పొందుతున్నాను. దయచేసి ఇలాంటి లేని పోనీ పుకార్లను పుట్టించొద్దు" అని అన్నారు.