English | Telugu
డోంట్ కేర్ అంటున్న నితిన్
Updated : Feb 4, 2014
నితిన్ నటించిన "హార్ట్ ఎటాక్" చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సంపాదించుకుంది. అయితే ఈ సినిమాలో పవన్ పేరు వాడుకున్నారు అంటూ వస్తున్న వార్తలపై నితిన్ స్పందిస్తూ..."నేను పవన్ కళ్యాణ్ గారి పేరు వాడుకుంటున్నానని చాలా మంది అంటున్నారు. బహుశా.. నేను సక్సెస్ లోకి రావడం వల్లే నాపై ఇలాంటి బురద జల్లుతున్నారని నా అభిప్రాయం. నిజానికి "జయం" సినిమా నుంచే నా సినిమాల్లో ఎక్కడో ఒక చోట పవన్ కళ్యాణ్ గారి సన్నివేశమో, డైలాగో ఉండేలా చూసుకుంటూ వచ్చాను. ఆయనపై నాకున్న ప్రేమ అది. నేనేంటో పవన్ గారికి తెలుసు. ఆయనేంటో నాకు తెలుసు. మధ్యలో ఎవరేమనుకున్నా డోంట్ కేర్" అని చెప్తున్నారు.