English | Telugu
'ఆదికేశవ' ట్రైలర్.. చాన్నాళ్లకు పర్ఫెక్ట్ కమర్షియల్ ఫిల్మ్!
Updated : Nov 20, 2023
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆదికేశవ'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జోజు జార్జ్, అపర్ణా దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
'ఆదికేశవ' ట్రైలర్ చూస్తుంటే చాలా రోజుల తర్వాత వస్తున్న పర్ఫెక్ట్ కమర్షియల్ ఫిల్మ్ లా అనిపిస్తోంది. వైష్ణవ్ తేజ్, శ్రీలీల మధ్య వచ్చే క్యూట్ ప్రేమ సన్నివేశాలతో ట్రైలర్ ప్రారంభమైంది. రొమాన్స్, కామెడీతో సరదాగా సాగిపోతున్న ట్రైలర్.. జోజు జార్జ్ పాత్ర రాకతో ఒక్కసారిగా వయలెంట్ గా మారిపోయింది. పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్స్, బీజీఎంతో ట్రైలర్ అదిరిపోయింది. "రాముడు లంక మీద పడింది వినుంటావు. అదే పది తలకాయలోడు అయోధ్య మీద పడితే ఎట్టా ఉంటాదో నేను చూపిస్తా", "నేను అయోధ్యలో ఉండే రాముడ్ని కాదప్పా.. ఆ రావణుడు కొలిచే రుద్ర కాళేశ్వరుడిని. తలలు కోసి చేతికిస్తా నాయాలా" డైలాగ్ లతో పాటు చివరిలో వైష్ణవ్ తేజ్ బీడీ వెలిగించిన షాట్ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచాయి.
రాధిక, సుదర్శన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.