English | Telugu
దళపతి ఆఖరి సినిమాకు డైరక్టర్ ఫిక్స్!
Updated : Jul 13, 2023
దళపతి విజయ్ రాజకీయాల్లోకి వస్తారా లేదా? ప్రస్తుతం తమిళ చిత్రసీమలో ఇదే అందరి మధ్యా నలుగుతున్న ప్రశ్న. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విజయ్ నటనకు స్వస్తి చెప్పనున్నట్లు నిన్నటి వరకు వార్తలు వచ్చాయి. విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇకపై సినిమాలు చేయరని విజయ్ మక్కల్ ఇయక్కం సభ్యులు చెప్పినట్టు వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. ఇప్పుడు విజయ్ లోకేష్ కనగరాజ్ డైరక్షన్‌లో మూవీ చేస్తున్నారు విజయ్. లియో షూటింగ్ పూర్తయింది. ఆల్రెడీ విజయ్ డబ్బింగ్ చెప్పడం కూడా స్టార్ట్ చేశారు. అక్టోబర్ 19న విడుదల కానుంది లియో.
ఈ సినిమా పూర్తయిన వెంటనే వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. దళపతి 68వ సినిమాగా బజ్ ఉంది ఆ మూవీకి. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని, దళపతి 68వ సినిమానే, ఆయన సినీ కెరీర్‌లో లాస్ట్ సినిమా అని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఈ వెర్షన్‌లో చేంజెస్ కనిపిస్తున్నాయి. మారి సెల్వరాజ్, మిస్కిన్, వెట్రిమారన్ వంటి వాళ్లు విజయ్ కోసం అద్భుతమైన కథలు రాసుకున్నారట. వాటిని విజయ్ మేనేజర్‌కి కూడా వినిపించారట. ఈ కోవలోనే మరో పేరు మళ్లీ తెరమీదకు వచ్చింది. ఆ డైరక్టర్ శంకర్.
ఆల్రెడీ శంకర్, దళపతి విజయ్ కలిసి పనిచేశారు. ఇప్పుడు కూడా మరోసారి కలిసి పనిచేస్తారనే టాక్ ఉంది. విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు, శంకర్ పర్ఫెక్ట్ పొలిటికల్ స్క్రిప్ట్ తో సినిమా చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ మధ్య కూడా విజయ్ తన మక్కల్ ఇయక్కమ్ సభ్యులతో సమావేశమయ్యారు. శంకర్ పొలిటికల్ స్క్రిప్ట్ బావుంటే చేసేయమని సలహాలు ఇచ్చారట సభ్యులు. దీంతో శంకర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారనే మాట వైరల్ అవుతోంది. ఆల్రెడీ 2012లో వీరిద్దరూ కలిసి పనిచేశారు. త్రీ ఇడియట్స్ అఫిషియల్ రీమేక్‌గా నన్బన్ చేశారు.