English | Telugu
అఖిల్ సినిమా మణిరత్నం సినిమాను తట్టుకోగలదా!
Updated : Feb 13, 2023
లెజెండరీ దర్శకుడు మణిరత్నం మరల ఫామ్ లోకి వచ్చారు. పోనియన్ సెల్వన్ తో భారీ హిట్ నమోదు చేసుకున్నారు. కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. రెండు భాగాలుగా ఈ సినిమాను రూపొందించగా మొదటి భాగాన్ని గత ఏడాది సెప్టెంబర్ 30న విడుదల చేశారు. రెండో భాగాన్ని ఈ ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రొమోను కూడా రిలీజ్ చేశారు.
అయితే అదే తేదీన హీరో అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడింది. దాంతో ఈసారి వాయిదా వేసే ఆలోచన లేకుండా ఏప్రిల్ 28 చేయబోతున్నట్టు బృందం అఫీషియల్ గా తెలియజేసింది. అయితే బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన పొన్నియన్ సెల్వన్ 2 చిత్రం ముందు దక్షిణాదినా ఏజెంట్ సినిమా తట్టుకొని నిలబడగలదా అనే అనుమానం చాలామందిలో కలుగుతుంది. ఏజెంట్ సినిమా యూనిట్ తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అని కొందరు విశ్లేషిస్తున్నారు. కొంతమంది ఈ నిర్ణయం తప్పని అంటున్నారు. ముందుగా అనుకున్నట్లు ఏప్రిట్ 14న సినిమా విడుదల చేస్తే బాగుంటుందని స్పందిస్తున్నారు.
దీనికి ఈ చిత్ర బృందం ఎలా స్పందించడంలో అర్థం కావడం లేదు. సినిమా రిలీజ్ విషయంలో మరోసారి ఏమైనా మార్పులు చేస్తుందా లేదా అనేది తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే. అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. అఖిల్కు ఏజెంట్ సినిమాపై ఎన్నో ఆశలున్నాయి. అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. అఖిల్ సరసన సాక్షి వైద్య నటిస్తోంది. మలయాళ స్టార్ మమ్ముట్టి కీలకపాత్రలో కనిపించబోతున్నారు. మమ్ముట్టి అఖిల్ను పట్టుకోవడం కోసం ప్రయత్నం చేసే అధికారిగా ఈ సినిమాలో చూపించబోతున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లు వసూలు చేస్తుందో చూడాలి. మొత్తానికి ఇది అఖిల్ కు సురేందర్ రెడ్డి కి డూ ఆర్ డై వంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వారు మణిరత్నంకు పోటీగా వెళ్లడం సరైన నిర్ణయం కాదేమో అని చాలామంది అభిప్రాయం.