English | Telugu
వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి డీటెయిల్స్
Updated : Jul 26, 2023
ఈ ఏడాది మీడియాలో బాగా హల్ చల్ చేసిన వార్తల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్‌మెంట్. జూన్‌లో మెగా ఫ్యామిలీ, సన్నిహితులు, పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగింది. పెళ్లి కచ్చితంగా ఎప్పుడు జరుగుతుందనే విషయం మాత్రం బయటకు రాలేదు. అయితే వీరు ఇప్పుడున్న ట్రెండ్‌ను ఫాలో అవుతూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారనే న్యూస్ అయితే వినిపిస్తోంది. వినిపిస్తోన్న సమాచారం మేరకు ఇటలీలో వరుణ్, లావణ్యల డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది.
బాలీవుడ్ స్టార్స్ రణ్వీర్ సింగ్, అలియా భట్ పెళ్లి కూడా ఇటలీలోనే ఘనంగా జరిగింది. ఇప్పుడు అదే స్టైల్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి కూడా ఇటలీలోనే భారీగా ప్లాన్ చేస్తున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ కాబట్టి అందరూ వెళ్లలేరు. పరిమిత సంఖ్యలో బంధుమిత్రులు, రెండు కుటుంబాలకు చెందినవారు మాత్రమే ఈ వేడుకకి హాజరవుతారని సమాచారం. మరి ఈ పెళ్లి వీడియోను ఏదైనా ఓటీటీ మీడియో తర్వాత ప్రసారం చేయనుందా? అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేమని కూడా టాక్ బయటకు వినిపిస్తోంది. డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కి ఇటలీ మంచి వేదికగా మారింది.
వరుణ్ తేజ్, లావణ్య కలిసి మిస్టర్ అనే సినిమాలో నటించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. కానీ.. ఇద్దరూ సీక్రెట్‌ను మెయిన్‌టెయిన్ చేస్తూ వచ్చారు. బయటకు న్యూస్ రకరకాలుగా వచ్చినప్పటికీ ఇద్దరూ కలిసి ఎక్కడా కనిపించలేదు. ఉన్నట్లుండి వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఇక సినిమాల విషయానికి వస్తే లావణ్య త్రిపాఠి చేతిలో పెద్దగా సినిమాలేం లేవు. పెళ్లి తర్వాత ఆమె తన కెరీర్‌ను కంటిన్యూ చేస్తుందో లేదో ఇప్పుడప్పుడే చెప్పలేమని సన్నిహిత వర్గాలంటున్నాయి. ఇక వరుణ్ తేజ్ అయితే మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఆగస్ట్ 25న `గాంఢీవధారి అర్జున` చిత్రంతో మెప్పించనున్నారు.