English | Telugu

పవన్ కళ్యాణ్ మాటలు మళ్ళీ రాజకీయ ప్రకంపనలేనా?

కళకు భాష లేదు అంటారు. సినిమా పరిశ్రమలో వివిధ విభాగాల్లో విభిన్న భాషలకు చెందివారు పనిచేస్తుంటారు. ప్రేక్షకులు సైతం భాషతో సంబంధం లేకుండా సినిమా బాగుంటే చాలు ఆదరిస్తారు. భాష, ప్రాంతం అనే అంతరాలను చెరిపివేస్తూ సినిమా రోజురోజుకి ఎదుగుతుంది. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ 'బాహుబలి-2', 'ఆర్ఆర్ఆర్' వంటి సినిమాలతో ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకుంది. మిగతా భాషలకు చెందిన పరిశ్రమలు కూడా అదే దిశగా అడుగులు వేస్తుండగా, తమిళ పరిశ్రమ తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. తమిళ సినిమాల షూటింగ్ లు ఆ రాష్ట్రంలోనే జరగాలని, అందులో పనిచేసేవారు తమిళులై ఉండాలని 'ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా'(ఫెఫ్సీ) నిబంధన తీసుకొచ్చింది. దీనిని ఇప్పటికే పలువురు తప్పుబడుతుండగా, తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని హితవు పలికారు. తెలుగు పరిశ్రమ లాగే తమిళ పరిశ్రమ కూడా అన్ని భాషల వారికి అవకాశం ఇవ్వాలని, అప్పుడే 'ఆర్ఆర్ఆర్' లాంటి ప్రపంచస్థాయి సినిమాలు చేయగలుగుతారని సూచించారు.

సాయి ధరమ్ తేజ్ తో కలిసి పవన్ కళ్యాణ్ నటించిన 'బ్రో' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న(జూలై 25న) జరిగింది. ఈ చిత్రానికి తమిళనాడుకి చెందిన సముద్రఖని దర్శకుడు కాగా, ఆయన సాక్షిగానే తమిళ పరిశ్రమ ఆలోచనా ధోరణి మారాలని పవన్ సూచించారు. "టాలీవుడ్ లో అన్ని భాషల వారు పనిచేస్తారు. ఇతర రాష్ట్రాలకు చెందినవారు మాత్రమే కాదు, ఇతర దేశాలకు చెందినవారు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. కేవలం ఒక్క ప్రాంతం వాళ్ళే ఉండాలి అనుకోకూడదు, అన్ని భాషల వాళ్ళు ఉంటేనే అది సినిమా అవుతుంది. పరిధి దాటి ఆలోచిస్తేనే తమిళ్ నుంచి కూడా ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు వస్తాయి. ఏఎం రత్నం గారు తెలుగువాడు అయినప్పటికీ, అప్పట్లో కోలీవుడ్ కి మంచి పేరు తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. స్థానికంగా ఏవైనా సమస్యలు ఉంటే, వాటి పరిష్కారం కోసం ప్రత్యామ్నాయంగా ఇతర ఉపాయాలను ఆలోచించాలి" అని పవన్ అన్నారు.

పవన్ సినీ పరిశ్రమ కోణంలోనే మాట్లాడినప్పటికీ ఇది రాజకీయ రంగు పులుముకునే అవకాశముంది. ఎందుకంటే ఫెఫ్సీ ప్రెసిడెంట్ ఎవరో కాదు ఏపీ మంత్రి రోజా భర్త ఆర్.కె.సెల్వమణి. అధికార పార్టీ నేతలు పవన్ ని వ్యక్తిగతంగా ఏస్థాయిలో విమర్శిస్తారో తెలిసిందే. రోజా సైతం పవన్ పైన విరుచుకుపడుతుంటారు. అలాంటిది ఇప్పుడు ఆమె భర్త ప్రెసిడెంట్ గా ఉన్న ఫెఫ్సీ నిర్ణయాన్ని పవన్ తప్పుబట్టడంతో, ఈ అంశం ఎలాంటి మలుపు తీసుకుంటుందా అనే ఆసక్తి నెలకొంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.