English | Telugu
హీరో వరుణ్ సందేశ్ కు గాయాలు!
Updated : Jun 22, 2023
యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో పలువురు హీరోలు గాయపడుతుంటారు. తాజాగా హీరో వరుణ్ సందేశ్ కూడా తన కొత్త సినిమా షూటింగ్ లో గాయపడ్డారు.
వరుణ్ సందేశ్ హీరోగా జాగృతి మూవీ మేకర్ బ్యానర్ పై నిర్మాణం అవుతున్న చిత్రం 'ది కానిస్టేబుల్'. బుధవారం ఈ చిత్రానికి సంబంధించిన ఫైటింగ్ సీన్ షూటింగ్ సమయంలో వరుణ్ సందేశ్ కాలికి బలమైన గాయమైంది. డాక్టర్లు వరుణ్ ని మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా చెప్పారు. దాంతో కానిస్టేబుల్ సినిమా షూటింగ్ అద్దాంతరంగా వాయిదా వేయాల్సి వచ్చిందని చిత్ర దర్శకుడు ఆర్యన్ శుభాన్ అన్నారు.
పూర్తిగా పల్లెటూరి వాతావరణం నేపథ్యంలో నిర్మాణం అవుతున్న ఈ చిత్రం ఒక కానిస్టేబుల్ జీవిత కథ చుట్టూ తిరుగుతుందని, 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర తదుపరి షెడ్యూల్ వరుణ్ సందేశ్ కోలుకున్న తర్వాత మొదలవుతుందని నిర్మాత బలగం జగదీష్ తెలియజేశారు.