English | Telugu
బాలీవుడ్‌కి వెళ్లనంటున్న యష్!
Updated : Jun 22, 2023
బాలీవుడ్ ట్రావెల్ గురించి కీలక ప్రకటన చేశారు హీరో యష్. బాలీవుడ్‌లో నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న రామాయణలో యష్ రావణుడిగా కనిపిస్తారని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. దీని గురించి ప్రస్తావించారు యష్. నేను ఎక్కడికీ పోవడం లేదు. ఇక్కడే ఉంటున్నా అని తనదైన స్టైల్‌లో స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీని అర్థం ఆయన బాలీవుడ్ సినిమా చేయడం లేదనేనంటూ శాండిల్‌వుడ్‌లో ప్రచారమవుతోంది.
కేజీయఫ్ ఫ్రాంచైజీ విడుదలైన తర్వాత యష్ ఇమేజ్ ప్యాన్ ఇండియాను దాటి వెళ్లింది. బిగ్ స్క్రీన్ మీద మళ్లీ ఎప్పుడెప్పుడు కనిపిస్తారా? అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. యష్ 19 అనౌన్స్ మెంట్ ఎందుకు లేటవుతుందా? అని ఒకానొక సందర్భంలో ఫ్యాన్స్ లో కంగారు కూడా కనిపించింది.వాటన్నిటికీ కూల్‌గా సమాధానం ఇచ్చారు యష్. తన హోమ్ టౌన్ మైసూర్‌కి తన భార్య, పిల్లలతో వెళ్లిన యష్ అక్కడ విలేకరులతో మాట్లాడారు. ``ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో సినిమా చూస్తారు. నాకు ఆ డబ్బు విలువ తెలుసు. వారు ఖర్చుపెట్టే ప్రతి రూపాయికీ నేను సమాధానం చెప్పాలి. అందుకే చాలా నిజాయతీగా, అంకితభావంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నాం.
మేం ఎలాంటి సినిమా తీస్తామోనని దేశమంతా ఎదురుచూస్తోంది. నిజానికి, ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. నా బాధ్యత పట్ల నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద చాన్నాళ్లుగా పని చేస్తున్నామని తెలుసు. ఆ కృషి తప్పకుండా అందరి ముఖాల్లోనూ చిరునవ్వు తెప్పిస్తుంది. నా అభిమానుల ముఖాలపై చిరు నవ్వు చూడటం నా బాధ్యత. అందుకే నేను ఇంత సమయం తీసుకున్నా. త్వరలోనే తీపి కబురుతో వస్తాను`` అని అన్నారు. నా జీవితంలో ఏ రోజూ ఒక్క సెకను కూడా వృథా కావడాన్ని నేను ఇష్టపడను. అది దృష్టిలో పెట్టుకునే టీమంతా కష్టపడుతున్నాం. అతి త్వరలోనే మంచి వార్తతో ముందుకొస్తాం`` అని అన్నారు. బాలీవుడ్ గురించి మాట్లాడుతూ ``నేనెక్కడికీ వెళ్లను. నా పనే నన్ను వెతుక్కుని వచ్చేలా చేస్తుంది`` అని అన్నారు. యష్ నెక్స్ట్ సినిమా గీతూ మోహన్‌దాస్‌తో ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. పెద్ద పెద్ద పేర్ల వెనుక, పెద్ద బడ్జెట్టుల వెనుక యష్ వెళ్లరు. ఆయన మనసు ఏం చెబితే అదే చేస్తారని అంటున్నారు యష్ సన్నిహితులు. ఈ నెల్లోనే గీతూ మోహన్‌దాస్ స్టోరీని అనౌన్స్ చేస్తారనే వార్తలున్నాయి.