English | Telugu
ఈ అర్ధరాత్రి నుంచి అమెజాన్ లో రవితేజ
Updated : Nov 17, 2023
మాస్ మాహారాజా రవితేజ హీరోగా మొన్న విజయదశమికి వచ్చి ఒక మోస్తరు విజయాన్ని సాధించిన సినిమా టైగర్ నాగేశ్వరరావు. భారతదేశపు అతి పెద్ద దొంగ స్టూవర్టు పురం నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో రవితేజ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన తాజా వార్త రవితేజ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను ఒక కొత్త రకం జోష్ ని తీసుకొచ్చింది.
రవితేజ ఒన్ అండ్ ఓన్లీ యాక్షన్ మూవీ టైగర్ నాగేశ్వరరావు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటిటి లో ప్రసారం కాబోతుంది. నవంబర్ 27 న రావాల్సిన నాగేశ్వరరావు కొంచం ముందుగానే వస్తుండటంతో రవితేజ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. తెలుగుతో పాటు తమిళ,మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా టైగర్ నాగేశ్వరరావు ఓటిటి ప్లాట్ ఫామ్ ద్వారా పాన్ ఇండియా ప్రేక్షకులని పలకరించబోతున్నాడు.
రవితేజ సరసన నుపుర్ సనన్,గాయత్రి భరద్వాజ్ లు నటించగా ప్రముఖ నటి రేణు దేశాయ్ ,బాలీవుడ్ దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్, మురళి శర్మ నాజర్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. అభిషేక్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకి వంశి కృష్ణ దర్శకత్వం వహించాడు.రవితేజ మార్క్ అయిన కామెడీ, యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి.