English | Telugu

‘కన్నూర్ స్క్వాడ్’ మూవీ రివ్యూ

మూవీ : కన్నూర్ స్క్వాడ్
నటీనటులు: మమ్ముట్టి, రోనీ డేవిడ్ రాజ్, అజీస్ నెడుమంగడ్, శబరీష్ వర్మ, కిషోర్, విజయ రాఘవన్ తదితరులు
ఎడిటింగ్: ప్రవీణ్ ప్రభాకరన్
సంగీతం: సుశీన్ శ్యామ్
సినిమాటోగ్రఫీ: మహమ్మద్ రాహిల్
స్క్రీన్ ప్లే: మహమ్మద్ షఫీ, రోనీ డేవిడ్ రాజ్
నిర్మాత: మమ్ముట్టి
దర్శకత్వం: రాబి వర్గీస్ రాజ్
ఓటిటి : డిస్నీ ప్లస్ హాట్ స్టార్


ఈ సంవత్సరం సెప్టెంబర్ 28 న మలయాళంలో రిలీజ్ అయిన కన్నూర్ స్క్వాడ్ మూవీ ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైంది. మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ కథేంటో ఒకసారి చూసేద్దాం...

కథ:

కేరళలోని ఒక అడవీ ప్రాంతంలో తెల్లవారుజామున ఒక వ్యక్తిని ఫాలో అవుతూ కన్నూర్ స్క్వాడ్ అనే పోలీసుల టీమ్ బయలుదేరుతుంది. ఆ పోలీసుల టీమ్ కి అడవిలో సీక్రెట్ గా ఉంటున్న కొందరు దుండగులు కన్పిస్తారు. అయితే వారిని ఎదుర్కునే సమయంలో అడవిలోని ఒక చెట్టుకి కుళ్ళిన శవం వేలాడుతూ కన్పిస్తుంది. అది ఎవరిదో తెలుసుకోవడానికి కన్నూర్ స్క్వాడ్ అని పిలవబడే జార్జ్, జోస్, జయన్ మరియు షఫీలు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఒక కేస్ ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ వెళ్ళిన కన్నూర్ స్క్వాడ్ టీమ్ కి అనుకోని సవాలు ఎదురవుతుంది. హోమ్ మినిస్టర్ గారి ఇంట్లో దోపిడితో పాటు హాత్యలు జరుగుతాయి. వాటిని ఇన్వెస్టిగేషన్ చేయమని కన్నూర్ స్క్వాడ్ కి పై అధికారులు సిఫార్స్ చేస్తారు. మరి అడవిలోని ఆ కూళ్ళిన శవం ఎవరిది? హోమ్ మినిస్టర్ ఇంట్లో హత్యల వెనుక కారణమేంటి? కన్నూర్ స్క్వాడ్ ఈ రెండు కేసులని పరిష్కారించారా లేదా తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే...


విశ్లేషణ:

అడవిలో ఒక వ్యక్తిని ఫాలో అవుతూ వెళ్ళిన కన్నూర్ స్క్వాడ్ అనే పోలీసుల టీమ్ కి కుళ్ళిన శవం చెట్టుకి వేలాడుతుండటంతో కథ ఆసక్తిగా మొదలైంది. ఆ తర్వాత కథ కాస్త ముందుకు వెళ్తుంది. అక్కడ ప్రస్తుతం వేరొక కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు కన్నూర్ స్క్వాడ్. జార్జ్ , జోస్, జయన్, షఫీ కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. హోమ్ మినిస్టర్ ఇంట్లో జరిగిన మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ లో కన్నూర్ స్క్వాడ్ కి కొన్ని అనుకొని పరిణామాలు ఎదురవుతాయి. వాటిని చక్కని స్క్రీన్ ప్లే తో ఒక ఇంటెన్స్ డ్రామని క్రియేట్ చేయడంలో డైరెక్టర్ రాబి వర్గీస్ రాజ్ విజయం సాధించాడు. ఒక కేసుతో మొదలైన ఈ కథ, మరో కేసుకి వెళ్ళడానికి పెద్దగా టైమ్ తీసుకోలేదు. కన్నూర్ స్క్వాడ్ ఇన్వెస్టిగేషన్ మొదలైన నుండి చివరిదాకా అదే సస్పెన్స్ ని క్రియేట్ చేస్తుంటుంది.

వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకోని తీసిన ఈ మూవీలో అడల్డ్ సీన్స్ ఏమీ లేవు. కానీ మర్డర్ మిస్టరీని చేధించే క్రమంలో అక్కడక్కడ శవాన్ని చూపించడంతో సున్నిత మనస్తత్వం గలవారు స్కిప్ చేస్తే బెటర్. అయితే ఒక సీరియస్ క్రైమ్ వెనుక ఉన్న మనిషి ఆలోచనని, విధానాన్ని పోలీసులు కనిపెట్టే సీన్ ఆధ్యాంతం ఆకట్టుకుంటుంది. మమ్ముట్టి వచ్చిన ప్రతీసారీ పెద్దగా ఎలవేషన్స్ ఏమీ ఇవ్వకుండా సాదాసీదాగా చూపించాడు డైరెక్టర్ రాబి వర్గీస్ రాజ్.

ప్రథమార్ధంలో మొదలైన కథ.. ద్వితీయార్థానికి వేగం పుంజుకుంటుంది. కండతడి పెట్టించే ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్, విలేజ్ లో సాగే యాక్షన్ సీక్వెన్స్, అయిపోయిందనుకున్న ఫ్లాష్ బ్యాక్ ని స్క్రీన్ ప్లేతో రెండు ముక్కలు చేసి చూపించడం అన్నీ కూడా ఒక ఇంటెన్స్ ని క్రియేట్ చేస్తాయి. పోలీస్ స్క్వాడ్ పడే పాట్లు, వారికి ఉండే లిమిటేషన్స్ అన్నీ ఆలోచింపజేస్తాయి. పోలీస్ వ్యాన్ కూడా ఒక పోలిస్ మ్యాన్ అనే చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. కుటుంబంలోని ప్రతీ ఒక్కరు కలిసి చూడగలిగేలా డైరెక్టర్ ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ని మలిచాడు. సుశీన్ శ్యామ్ సంగీతం సీన్ కి తగ్గట్టుగా ఉంది. మహమ్మద్ రాహిల్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ప్రవీణ్ ప్రభాకరన్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.


నటీనటుల పనితీరు:

జార్జ్ పాత్రలో మమ్ముట్టి సినిమాకి ఆయువు పట్టుగా నిలిచాడు. కన్నూర్ స్క్వాడ్ లోని రోనీ డేవిడ్ రాజ్, అజీస్ నెడుమంగడ్, శబరీష్ వర్మ పాత్రలు ప్రధాన బలంగా నిలిచాయి. భీమిలి కబడ్డీ జట్టులోని కోచ్ పాత్ర చేసిన 'కిషోర్' .. ఈ సినిమాలో స్పెషల్ ఆఫీసర్ కి హెడ్ గా ఆకట్టుకున్నాడు.


తెలుగువన్ పర్ స్పెక్టివ్:

సస్పెన్స్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే అభిమానులే కాదు ప్రతీ ఒక్కరు చూడదగ్గ ఒక సూపర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.


రేటింగ్: 3 / 5


✍🏻. దాసరి మల్లేశ్

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.