English | Telugu

తెలుగు సినిమాలు బంద్ 

మనిషికి  కల్లా కపటం లేని ఆనందాన్ని, కల్లా కపటం లేని అభిమానాన్ని ఇచ్చే ఏకైక సాధనం సినిమా. దేవుడ్ని అయినా కొలవని వారు ఉంటారేమో గాని సినిమా వాళ్ళని కొలవని వాళ్ళు ఉండరు. సినిమాకి అంతటి  శక్తీ ఉంది.అసలు  సినిమా చూడకుండా నిద్రపోని వారు కూడా  చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఆ సినిమాకి కష్టం వచ్చి పడింది.


 17 - 5 - 2024   శుక్రవారం నుండి  తెలంగాణాలో ఒక  పది రోజులు పాటు  థియేటర్స్ మూతపడనున్నాయి. ప్రస్తుతం  మార్కెట్ లో  బడా హీరోల నుంచి ఒక మోస్తరు హీరోల దాకా  ఎలాంటి సినిమాలు లేవు. దీంతో  థియేటర్లు నడపటం భారం కావడంతో తెలంగాణ  థియేటర్స్ యాజమాన్యం ఈ నిర్ణయo తీసుకుంది.  సింగల్ స్క్రీన్ థియేటర్స్ వరకు  బంద్ కానున్నాయి.  ఈ వార్త సినీ ప్రేమికులకి అయితే బ్యాడ్ న్యూసే. వారంతా  కొన్ని రోజులు  సినీ పండుగకి దూరం కాక తప్పదు తిరిగి  ఎప్పుడు ప్రారంభించేది మళ్ళీ అధికారకంగా ప్రకటిస్తారు. ఏం చేస్తాం కష్టాలు మనుషులకే కాదు సినిమాలకి వస్తాయి

గతంలో కూడా ఒక సారి ఇలాగే జరిగింది. కరెంట్ బిల్, స్టాఫ్ సాలరీస్ పెను భారం కావడంతో క్లోజ్ చేసారు. ఇక మల్టి ప్లెక్స్ థియేటర్స్ మాత్రం యధావిధిగా ఉంటాయి. సింగల్ స్క్రీన్  థియేటర్స్ మూసివేత విషయం మాత్రం ఇప్పుడు ప్రేక్షకుల్లో  హాట్ టాపిక్ గా మారింది