English | Telugu

హాలీవుడ్ కి టబు

 2021 లో విడుదలయ్యి సంచలన విజయం సాధించిన హాలీవుడ్ మూవీ డ్యూన్.సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం నాలుగువందల ఏడు మిలియన్ల డాలర్స్ ని సంపాదించింది. డ్యూన్ పార్ట్ టూ కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆ సిరీస్ కి వెబ్ సిరీస్ తెరకెక్కనుంది.  

 టబు ఇటీవల  క్రూ తో మంచి విజయాన్ని దక్కించుకుంది. కరిష్మా కపూర్, కృతి సనన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకొని   తన నటనలో ఏ మాత్రం సత్తా  తగ్గలేదని నిరూపించింది.ఇప్పుడు  డ్యూన్ సిరీస్ లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది    సిస్టర్ ఫ్రాన్సిస్కా పాత్రలో మెరవబోతుంది. ఇది ఆమెకి మంచి అవకాశం అని చెప్పవచ్చు.తను ఎలా నటిస్తుందో అనే ఆసక్తి కూడా అందరిలో ఉంది.త్వరలో చిత్రీకరణ  ప్రారంభం కానుండగా  మాక్స్‌లో ఈ సిరీస్‌ అందుబాటులోకి రానుంది. . ఎమిలీ వాట్సన్, ఒలివియా విలియమ్స్, ట్రావిస్ ఫిమ్మెల్, మార్క్ స్ట్రాంగ్, జేడ్ అనౌకా, క్రిస్ మాసన్, జోధి మే మరియు జోష్ హ్యూస్టన్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు

 1982 లో వచ్చిన బజార్ అనే హిందీ  చిత్రం ద్వారా  టబు సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగులో మాత్రం 1991 లో  విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన కూలీ నెంబర్ వన్ తో పరిచయం అయ్యింది.నిన్నే పెళ్లాడుతా, ఆవిడా మా ఆవిడే, అందరి వాడు లాంటి సినిమాల్లో నటించింది. జాతీయ అవార్డు ని కూడా గెలుచుకున్న టబు ఇప్పటివరకు హిందీ తో పాటు ఇతర భాషల్లో కలుపుకొని  సుమారు 50 సినిమాలకి పైగానే చేసింది