English | Telugu
బాహుబలిలో తమన్నాకి తగినంత గుర్తింపు రాలేదా?
Updated : Jun 14, 2023
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా బాహుబలి. బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అయిన చిత్రమిది. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ ఇండియన్ సినిమా డైనమిక్స్ మార్చేశాయి.
ఈ సినిమాతో ప్రభాస్‌కీ, రానాకీ చాలా మంచి పేరు వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. సౌత్ సినిమా మీద ఒక్కసారిగా ఫ్లడ్ లైట్స్ పడటానికి కారణమైన సినిమాగా బాహుబలికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ సినిమాలో తమన్నా, అనుష్క, రమ్యకృష్ణ కీ రోల్స్ చేశారు. ఇటీవల ఈ సినిమా గురించి ఓపెన్ అయ్యారు తమన్నా.
ఈ మెగా సక్సెస్‌ని తాను ఎందుకు క్యాష్ చేసుకోలేకపోయారో మాట్లాడారు. తమన్నా మాట్లాడుతూ ``నేను గమనించింది ఒకటే. యాక్షన్ సినిమా అనగానే క్రెడిట్ అంతా మేల్ స్టార్స్‌కే ఇచ్చేస్తారు. బాహుబలి విషయంలో ప్రభాస్‌కీ, రానాకీ క్రెడిట్ దక్కడం మంచిదే. ఎందుకంటే సినిమాలో వాళ్ల పార్ట్ ఎక్కువ. వాళ్లతో పోలిస్తే నా పార్ట్ తక్కువ. అప్పట్లో ఆ సినిమాకు వచ్చిన సక్సెస్‌ని క్యాష్ చేసుకోవాలని అనిపించలేదు. అసలు ఆ తరహా మానసిక స్థితిలో లేను. కాకపోతే ఆ సినిమా వల్ల నాకు ప్రేక్షకుల్లో మరింత గుర్తింపు వచ్చింది. లవ్ దక్కింది. పచ్చబొట్టేసినా పాటకు ఇప్పటికే స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు`` అని అన్నారు. నార్త్ అండ్ సౌత్‌లో వరుసగా ప్రాజెక్టులు చేస్తున్నారు తమన్నా. లేటెస్ట్ గా రిలీజ్ అయిన లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ తమన్నాను నెక్స్ట్ లెవల్‌లో చూపిస్తోంది. సూపర్ హాట్ ఫొటో షూట్స్ తోనూ, విజయ్ వర్మతో డేటింగ్ రూమర్స్ తోనూ న్యూస్‌లో ఉన్నారు మిస్ భాటియా. ఈ ఏడాది ఆగస్టు 11న భోళాశంకర్ విడుదలకు సిద్ధమవుతోంది. ఆగస్టు 10న జైలర్ విడుదలకు రెడీ అవుతోంది. ఇవి కాకుండా దిలీప్ మలయాళం సినిమా బాంద్రా కూడా రెడీ అవుతోంది. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు మిల్కీ బ్యూటీ.