English | Telugu

కాంతార ఆఫ‌ర్‌ని రిజ‌క్ట్ చేసిన ప‌వ‌ర్‌స్టార్‌!

కాంతార మూవీలో హీరోగా న‌టించ‌మ‌ని ముందు ప‌వ‌ర్‌స్టార్‌నే అప్రోచ్ అయ్యార‌ట రిష‌బ్ శెట్టి. కానీ, నేను చేయ‌న‌ని రిజ‌క్ట్ చేశార‌ట ప‌వ‌ర్‌స్టార్‌. ఇంత‌కీ ఏమైంది? ఎందుకు రిజ‌క్ట్ చేశార‌ని ఆరా తీస్తే, ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు చెప్పుకొచ్చారు రిష‌బ్ శెట్టి. ``2022లో బిగ్గెస్ట్ హిట్‌గా పేరు తెచ్చుకున్న సినిమా కాంతార‌. రిష‌బ్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డ‌మే కాదు, ఈ సినిమాలో న‌టించారు. ఈ ఒక్క సినిమాతో నేష‌న‌ల్ సినీ మ్యాప్‌లో రిష‌బ్‌కి స్పెష‌ల్ ప్లేస్ ద‌క్కింది. అయితే, ఈ సినిమాలో న‌టించ‌మ‌ని క‌న్న‌డ ప‌వ‌ర్‌స్టార్ పునీత్‌నే ఫ‌స్ట్ అప్రోచ్ అయ్యార‌ట రిష‌బ్ శెట్టి. ``అప్పుకైతే శివ కేర‌క్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ గా ఉంటుంద‌నిపించింది. అందుకే అప్రోచ్ అయ్యాను.

కానీ అప్ప‌టికే ఆయ‌న హెక్టిక్ షెడ్యూల్స్‌తో ఉన్నారు. పైగా ఈ కేర‌క్ట‌ర్ కోసం కోస్ట‌ల్ క‌ర్ణాటిక్ డైల‌క్ట్ లో మాస్ట‌ర్ కావాల‌ని చెప్పాను. ఆయ‌న చేస్తే ప్రాజెక్ట్ ఇంకో రేంజ్‌లో ఉంటుంద‌ని అనుకున్నాను. ముఖ్యంగా బ‌ఫెలో సీన్స్ లో ఆయ‌న్ని ఊహించుకున్న‌ప్పుడు గూస్‌బంప్స్ వ‌చ్చాయి. పునీత్ కూడా క‌థ విని ఎగ్జ‌యిట్ అయ్యారు. కానీ, ఆయ‌న‌కున్న అద‌ర్ క‌మిట్ మెంట్స్ వ‌ల్ల ఈ ప్రాజెక్ట్ ప్రిప‌రేష‌న్‌కి టైమ్ కేటాయించ‌లేక‌పోయారు. ఓ రోజు ఫోన్ చేసి, ఈ సినిమాలో తనే కావాల‌నుకుంటే ఇంకో ఏడాది పాటు ఆగాల్సి ఉంటుంద‌ని, త‌ను లేకుండా ప్రొసీడ్ అవ్వ‌మ‌ని చెప్పారు. అప్పుడు డిసైడ్ అయి నేనే చేశాను`` అని అన్నారు రిష‌బ్‌.

ఈ సినిమాను పునీత్ సిల్వ‌ర్ స్క్రీన్ మీద చూడ‌నే లేదు. గుండెపోటుతో 2021లో క‌న్నుమూశారు పునీత్‌. కాంతార క‌న్న‌డ‌లో తొలుత విడుద‌లైన‌ప్ప‌టికీ, తెలుగు, హిందీతో పాటు మిగిలిన భాష‌ల్లోనూ రెండు వారాల త‌ర్వాత విడుద‌లైంది. 400 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. కాంతార 2 సినిమాను ఈ మార్చిలో మొద‌లుపెట్టారు. కాంతార‌కి ఇప్పుడు వ‌స్తున్న‌ది సీక్వెల్ కాదు, ప్రీక్వెల్‌. ప్ర‌స్తుతం రీసెర్చి ప‌నులు జ‌రుగుతున్నాయి. ప్రీక్వెల్‌లో హిస్ట‌రీని డీప్‌గా చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని అన్నారు హోంబ‌లే ఫిల్మ్స్.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.