English | Telugu

ఒక్క చెన్నైలోనే సూర్య 'అంజాన్' కి అన్ని థియేటర్లా..!

ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలు సాధ్యమైనంత వరకూ ఎక్కువ థియేటర్లలో విడుదల చేసి మొదటి వారంలో కలెక్షన్స్ రాబట్టుకోవడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. మన తెలుగు నిర్మాతలు ఈ స్ట్రాటజీని పాటిస్తున్నారు. ఇప్పుడు ఈ అలవాటు మెల్లగా తమిళ సినిమాలో వచ్చేసింది. సూర్య నటించిన సికిందర్ చిత్రం ఆగస్టు 15న భారీగా విడుదలవుతుంది. లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సూర్య, సమంత నటించారు. తమిళంలో 'అంజాన్' అనే పేరుతో విడుదలవుతుండగా... తెలుగులో 'సికిందర్' అనే పేరుతో విడుదలవుతుంది.

తెలుగు, తమిళం రెండు భాషల్లో కలిపి సుమారుగా 1500 ధియేటర్లలో ఈ సినిమా విడుదవుతుంది. చెన్నైలో ఏకంగా ఈ సినిమాని 37 ధియేటర్లలో ప్రదర్శించనున్నారు. చెన్నై నగరానికి చెందిన ఈ సినిమా హక్కులను అభిరామి రామనాథన్ కొనుగోలు చేశారు. రామ్ నాధన్ మాట్లాడుతూ.. ''గతంలో చెన్నైలో ఐదు థియేటర్లలోనే సినిమా విడుదలయ్యేది. రజనీకాంత్‌ నటించిన 'శివాజి' గరిష్ఠంగా 18 థియేటర్లలో విడుదల చేశాం. ఇప్పుడు 'అంజాన్‌'ను 37 ధియేటర్లలో విడుదల చేస్తున్నారు.

సూర్య అభిమానులకు టిక్కెట్లు లభించడం లేదని తెలయడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. పైరసీ సీడీలను అడ్డుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. చెన్నైలోని అభిరామి థియేటర్‌‌లో రిజర్వేషన్ ప్రారంభించిన రెండు గంటలకే 5,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఈ సినిమా సూర్య కెరియర్‌లోనే ఓ మైలు రాయిగా నిలవడంతో పాటు బాక్సాఫీసు రికార్డుల్ని తిరగరాస్తుందన్నారు. సూర్య సరసన తొలిసారిగా సమంత నటిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజా అందించగా.. సంతోష్ శివన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.