English | Telugu

ఎన్టీఆర్ 29న డిసైడయ్యాడు..!

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా ‘కందిరీగ’ ఫేం సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ‘రభస’. ఈ సినిమా రిలీజ్ డేట్ పై గత కొన్ని రోజులుగా ఏర్పడిన గందరగోళానికి నిర్మాత బెల్లంకొండ సురేష్ తెరదించారు. ఈ చిత్రాన్ని 29న తప్పకుండా విడుదల చేస్తామని ప్రకటించారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం మా బేనర్‌లో మరో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలుస్తుందని అన్నారు. ‘రభస’ ను మొదట ఆగస్ట్ 14న లేదా 15న విడుదల చేయాలని నిర్మాతలు అనుకున్నారు. కానీ ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం వల్ల రిలీజ్ ను వాయిదా వేశారు. ఎన్టీఆర్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్ లుగా నటిస్తున్న ఈచిత్రానికి థమన్ మ్యూజిక్ అందించాడు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.