English | Telugu
మహేష్ బాబు మనసు బంగారం
Updated : Nov 16, 2023
సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో సేవాకార్యక్రమాలతో రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇప్పటికే ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించిన మహేష్.. తాజాగా మరో గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాడు.
తన భార్య నమ్రతా శిరోద్కర్ తో కలిసి 2020లో 'మహేష్ బాబు ఫౌండేషన్'ని స్థాపించాడు మహేష్. ఈ ఫౌండేషన్ ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులతో జన్మించిన శిశువులకు అండగా నిలుస్తోంది. దీని ద్వారా ఇప్పటిదాకా 2500 మందికి పైగా పిల్లలను రక్షించారు.
ఇక ఇప్పుడు లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళిగా తాజాగా మహేష్ దంపతులు 'సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్'ను ప్రారంభించారు. దీని ద్వారా పేద కుటుంబాలకు చెందిన 40 మంది పైగా మెరిట్ స్టూడెంట్స్ కి స్కూల్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి వరకు ఆర్థిక సాయం చేయనున్నారు.
బాగా చదవగలిగినా పేదరికం కారణంగా చదువుకి దూరమైనవారు ఎందరో ఉంటారు. అలాంటి వారికి అండగా నిలబడటం కోసం మహేష్ ముందుకు రావడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.