English | Telugu
అక్షరాలా ఆరు ఫైట్లు.. సూర్య ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోతుందట!
Updated : Nov 16, 2023
హీరో సూర్య ఎంత కమిటెడ్‌గా వర్క్ చేస్తాడో అందరికీ తెలిసిందే. తను చేసే ప్రతి సినిమాలోనూ అతని కష్టం కనిపిస్తుంది. ప్రతి సినిమానూ ప్రాణం పెట్టి చేస్తాడు కాబట్టే ప్రేక్షకులు కూడా అతన్ని, అతని సినిమాలను ఆదరిస్తారు. తాజాగా సూర్య చేస్తున్న సినిమా ‘కంగువా’. శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీని రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సూర్య కెరీర్‌లోనే ఇది హయ్యస్ట్ బడ్జెట్ సినిమానే కాకుండా, ఇప్పటివరకు అతను చెయ్యని ఓ డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్ కూడా. 2డి, 3డి ఫార్మాట్‌లలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది.
ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలను చెన్నయ్‌లో చిత్రీకరిస్తున్నారు. సూర్య గెటప్ ఈ సినిమాలో చాలా డిఫరెంట్‌గా ఉండబోతోంది. అతని క్యారెక్టర్‌ను చాలా పవర్‌ఫుల్‌గా చేశాడు డైరెక్టర్ శివ. ఇక యాక్షన్ సీక్వెన్స్‌ల గురించి చెప్పాలంటే సినిమాలో మొత్తం ఆరు ఫైట్స్ ఉంటాయి. ఈ ఆరు ఫైట్స్‌ను చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేశారట. అండర్ వాటర్‌లో తీసిన యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్‌ని బాగా థ్రిల్ చేస్తుందని తెలుస్తోంది. అలాగే ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లోని ఫైట్ హాలీవుడ్ మూవీని తలపించేలా ఉంటుందట. ఇక బీచ్‌లో, బోట్‌లో, ఫ్లైట్‌లో, జిమ్‌లో డిఫరెంట్ ప్యాట్రన్‌లో తీసిన యాక్షన్ సీన్స్ సినిమాకి పెద్ద పైలైట్ కాబోతున్నాయని తెలుస్తోంది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా కోసం సూర్య అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
సూర్య సరసన దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్, జగపతిబాబు క్యారెక్టర్స్ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. వచ్చే సంవత్సరం సమ్మర్ సీజన్‌లో ఈ సినిమాను 6 భాషల్లో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.