English | Telugu
మిలియన్ మందిని ఆకర్షించిన సన్నీ పింక్ లిప్స్
Updated : Jul 8, 2014
హేట్ స్టోరీ 2 సినిమా కోసం చిత్రీకరించిన పింక్ లిప్స్ పాటను జూలై 2న యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. వారం రోజులు కూడా గడవక ముందే ఈ వీడియోని 13 లక్షలకు పైగా వ్యూవర్స్ వీక్షించారు. ఈ పాటకు ఉమా-గైటీ కొరియోగ్రఫి చేయగా, మీట్ బ్రోస్ అంజన్ సంగీతం సమకూర్చారు. జూలై 18న ఈ చిత్రం విడుదల కాబోతోంది.
అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన సన్నీలియోన్ బాలీవుడ్ చిత్రాల్లో నటించక ముందే పాపులర్. ఇప్పుడు ఇండియన్ సినిమాలలో పని చేయటం మొదలు పెట్టిన సన్నీ ఎంట్రీ మొదలుకొని ఏం చేసినా పాపులారిటీ మాత్రం ఖాయం. సోషల్ మీడియాలో ఈమె పాపులారిటీ స్టార్ హీరోలకు తప్పకుండా పోటీనే అనిపిస్తోంది. అయితే ఇక్కడో విషయం వుందడోయ్, పాపులారిటీ వేరు విజయం వేరు. సన్నీ పాపులారిటీ ఆమె నటిస్తున్న ఈ చిత్ర విజయానికి ఎంత వరకూ వుపయోగపడుతుందో చూడాలి.