English | Telugu

చార్మీనార్ ముందు బండి డ్రైవ్ చేస్తున్న పరిణీతి




అవునూ, నిజమే. చార్మీనార్ ముందే కాదు, టాంక్ బండ్ మీద కూడా బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా బండి నడుపుతూ కనిపించింది. అయితే అది తన తాజా చిత్రం దావత్ ఏ ఇష్క్ సినిమా ట్రెయిలర్ లో. ఈ సినిమాలో పరిణీతి హైదరాబాదీ అమ్మాయిగా , ఆషికీ-2 ఫేం ఆదిత్య రాయ్ కపూర్ లక్నో అబ్బాయిగా కనిపించబోతున్నారు.

ఈ చిత్రం కోసం హైదరాబాదులో సెట్ కూడా నిర్మించారు. హైదారాబాద్ లోని గోల్కొండా, సిటీ కాలేజ్ తో పాటు పలు ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించారు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హబీబ్ ఫజల్ డైరెక్ట్ చేస్తుండగా, ఆదిత్య చోప్రా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ట్రెయిలర్ తోనే ఊరిస్తున్న ఈ దావత్ ఏ ఇష్క్ సినిమా సెప్టెంబర్ 5 న విడుదల కానుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.