English | Telugu

దృశ్యం అందరూ చూడొచ్చు - సెన్సార్


మలయాళంలో సూపర్‌ హిట్‌ రీమేక్ చిత్రం ‘దృశ్యం’ సెన్సార్ ముగించుకున్నట్లు సమాచారం. వెంకటేష్, మీనా ప్రధాన తారాగణంగా రూపొందుతున్న ఈ చిత్రం ట్రెయిలర్స్ చూసిన ప్రేక్షకులు ఇదొక చక్కటి
కుటుంబ తరహా చిత్రం అనే అంచనాకు వస్తున్నారు. సెన్సార్ అధికారులు కూడా ఈ చిత్రాన్ని చూసి అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. ఈ సినిమాకు క్లీన్ యు సర్టిఫికేట్ లభించిందని తెలుస్తోంది.

మలయాళంలో మోహన్ లాల్ చేసిన పాత్రకు తెలుగులో వెంకటేష్ ఎంతవరకూ న్యాయం చేశారనే విషయంపై భిన్న రకాల టాక్ ఫిలింనగర్ లో వినిపిస్తోంది. ఆ విషయం తేలాలంటే సినిమా విడుదల వరకూ వేచి వుండాల్సింది. ఈ చిత్రాన్ని జూలై 11న విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.