English | Telugu
సోషల్ మీడియాలో ప్రభాస్ కొత్త మూవీ రచ్చ
Updated : Nov 24, 2023
ఇక వచ్చే నెల నుంచి ప్రభాస్ సలార్ మూవీ హంగామ స్టార్ట్ అవ్వబోతుంది. డిసెంబర్ 22 న వరల్డ్ వైడ్ గా విడుదలకి సిద్ధంగా ఉన్న సలార్ తర్వాత మరి కొన్ని క్రేజీ ప్రాజెక్టులు ప్రభాస్ చేతిలో ఉన్నాయి. అందులో ఒక క్రేజీ ప్రాజెక్ట్ స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఆ స్పిరిట్ రూపుదిద్దుకోబోతుంది. ఇప్పుడు ఈ స్పిరిట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ యానిమల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య అన్ స్టాపబుల్ షో లో పాల్గొన్నాడు.ఆ షో లో రణబీర్ తో పాటు యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా పాల్గొన్నాడు .ఈ షో లో రణబీర్ మాట్లాడుతు ప్రభాస్ అండ్ సందీప్ ల సినిమాలో ఒక చిన్న క్యారక్టర్ అయిన చేస్తాను అని అన్నాడు .ఇప్పుడు రణబీర్ చేసిన ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో స్పిరిట్ హాష్ ట్యాగ్ టాప్ లో ట్రెండ్ అవుతోంది.అలాగే ప్రభాస్ అభిమానులు కూడా స్పిరిట్ సినిమా త్వరగా స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నారు.
ప్రభాస్ లిస్ట్ లో స్పిరిట్ తో పాటు కల్కి 2898AD అండ్ మారుతి సినిమాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాలు కూడా అత్యంత భారీ బడ్జట్ తో పాన్ ఇండియా లెవెల్లో నిర్మాణం జరుపుకోబోతున్నాయి.