English | Telugu
‘ది విలేజ్’ వెబ్ సిరీస్ రివ్యూ
Updated : Nov 25, 2023
వెబ్ సిరీస్ : ది విలేజ్
నటీనటులు: ఆర్య, దివ్య పిళ్ళై, ఆడుకాలమ్ నరేన్, జార్జ్, పూజా రామచంద్రన్, మయన్ తదితరులు
రచన : దీప్తి గోవిందరాజన్, మిలింద్ రాజు, దీరజ్
ఎడిటింగ్ : లారెన్స్ కిషోర్
సినిమాటోగ్రఫీ: శివకుమార్ విజయన్
మ్యూజిక్: గిరీష్ గోపాలకృష్ణన్
నిర్మాతలు: బిఎస్ రాధాకృష్ణన్
దర్శకత్వం: మిలింద్ రాజు
ఓటిటి: అమెజాన్ ప్రైమ్ వీడియో
' ది విలేజ్ ' అనే గ్రాఫిక్ నవల ఆధారంగా మిలింద్ రాజు ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించాడు. తమిళ హీరో ఆర్య నటించిన తొలి వెబ్ సిరీస్ ఇది. మరి ఆ కథేంటో ఒకసారి చూసేద్దాం...
కథ:
ఒక అడవిలో రాత్రివేళ కొందరు ఒక వ్యాన్ లో కటియాళ్ అనే విలేజ్ ద్వారా వెళ్తుండగా.. అనుకోకుండా ఆ వ్యాన్ కి ఎదురుగా ఒకతను వచ్చి చనిపోతాడు. అతనెవరో చూద్దామని వెళ్ళిన వ్యాన్ డ్రైవర్, వ్యాన్ లోని వ్యక్తులు అక్కడికక్కడే మరణిస్తారు. మనుషులని వేటాడే కొన్ని వింత జంతువులు వీరిని చంపేస్తాయి. ఆ తర్వాత గౌతమ్(ఆర్య) , తన భార్య నేహా(దివ్య పిళ్ళై), కూతురు మాయా(బేబీ ఆజియా)లతో కలిసి చెన్నై నుండి తొట్టంపూడు రోడ్ మార్గంలో వెళ్తుంటారు. ఇంతలో వాళ్ళు వెళ్ళాల్సిన దారి కాకుండా అడ్డదారిలో వెళ్తుంటారు. కటియాళ్ విలేజ్ దగ్గరికి రాగానే గౌతమ్ నడుపుతున్న కారు టైర్ పంచర్ అవుతుంది. ఇక కారులో పాప, భార్యని వదిలేసి పంచర్ చేపించడానికి ఎవరినైనా తీసుకొద్దామని ముందుకు వెళ్తాడు. అలా సుమారు ఓ గంట సేపు నడిచాక.. ఒక వైన్ షాప్ దగ్గర కొంతమందిని సాయమడుగుతాడు గౌతమ్. ఇక అక్కడి వారంతా కటియాళ్ పేరు వినగానే భయపడిపోతారు. కాసేపటికి గౌతమ్ కి సాయం చేయడానికి శక్తివేల్, పీటర్ పాండియన్ వస్తారు. కానీ ఆ కటియాళ్ విలేజ్ దగ్గరకొచ్చి చూస్తే గౌతమ్ కారుతో పాటు తన ఫ్యామిలీ మిస్ అవుతుంది. మరి గౌతమ్ తన భార్య, పిల్లల్ని కాపడుకున్నాడా? ఆ విలేజ్ మిస్టరీ ఏంటి అనేది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ లు చూడాల్సిందే.
విశ్లేషణ:
కటియాళ్ అనే ఒక మిస్టరీ విలేజ్ దగ్గర ఎవరు ఊహించని విధంగా మర్డర్స్ జరుగుతుంటాయి. వాటిని చేస్తుందెవరనే సీరియస్ అంశంతో డైరెక్టర్ మిలింద్ రాజు కథని ఎత్తుకున్న తీరు బాగుంది. ఆ విలేజ్ దగ్గరికి రాగానే ఎవరైనా చావాల్సిందే అంటూ జనాల్లో ఓ రకమైన భయాన్ని నింపారు. సైంటిఫికల్ రీసెర్చ్ ఇంత దారుణంగా ఉంటుదా అనే మరో అంశాన్ని ప్రేక్షకుడికి చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఇంతకమందు గృహం అనే హర్రర్ సినిమాని తీసిన డైరెక్టర్ మిలింద్ రాజు.. ఇప్పుడు అదే జానర్ ని తీసాడు. అదనంగా సైంటిఫిక్ రీసెర్చ్ ని కలిపాడు.
ప్రతీ ఎపిసోడ్ కు ట్విస్ట్ ఇస్తూ చివరి వరకు ఫుల్ ఎంగేజింగ్ చేయడంలో డైరెక్టర్ మిలింద్ రాజు సక్సెస్ అయ్యాడు. ఈ వెబ్ సిరీస్ లో మొత్తంగా ఆరు ఎపిసోడ్‌లు ఉన్నాయి. ప్రథమార్థం ముగిసేసరికి అనగా.. మొదటి మూడు ఎపిసోడ్ లు ఎప్పుడు అయిపోయాయా అనిపిస్తుంది. ఇక అక్కడ అక్కడ గతానికి, ప్రస్తుతానికి కథ మారుతూ ఉంటుంది. అసలు కథ నుండి ప్రేక్షకుడిని ఎటూ మారిపోకుండా సస్పెన్స్ తో పాటు థ్రిల్ ని ఇచ్చాడు డైరెక్టర్.
అయితే గౌతమ్ ఫ్యామిలీని కాపాడేందుకు వచ్చిన వారు చేసే సపోర్ట్ కి అందరు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. ఒకవైపు ఆ తర్వాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ, మరోవైపు ఆ పాత్రలకి ఏం జరుగుతుందోనన్న ఆందోళన కలిగించేలా ద్వితీయార్థాన్ని అద్భుతంగా మలిచారు.
క్రైమ్ థ్రిల్లర్ ని ఇష్టపడేవారికి ఈ వెబ్ సిరీస్ ఒక ఫీస్ట్ అవుతుంది. అక్కడక్కడ కొన్ని అడల్ట్ సీన్స్ ఉన్నాయి. థ్రిల్లర్స్ ని ఇష్టపడేవారు ఫ్యామిలీతో కాకుండా ఇండివిడ్యువల్ గా చూస్తే ఇది నచ్చేస్తుంది. ఎపిసోడ్ ల నిడివి కాస్త ఎక్కువగా ఉన్న మొదటి నుండి చివరి ఎపిసోడ్ వరకు ఫుల్ ఎంగేజింగ్ గా ఉంటుంది. ఎడిటింగ్ బాగుంది. కాస్త ట్రిమ్ చేస్తే బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎఫెక్ట్ వర్కవుట్ అయ్యాయి. బిజిఎమ్ కొన్ని చోట్ల సీన్ ని ఎలవేట్ చేస్తూ ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
ఆర్య ఈ వెబ్ సిరీస్ కి ఆయువుపట్టుగా నిలిచాడు. దివ్య పిళ్లై మంచి సపోర్ట్ ఇచ్చింది. ఆడుకాలం నరేన్, జార్జ్ మయాన్, పూజా రామచంద్రన్ వారి వారి పాత్రలకి న్యాయం చేశారు.
తెలుగువన్ పర్ స్పెక్టివ్:
ఒక హర్రర్ థ్రిల్లర్ గా కన్పించే ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ ని ఒకసారి చూసేయోచ్చు. సైంటిఫిక్ రీసెర్చ్ ని హర్రర్ మరియు థ్రిల్లర్ గా తీర్చిదిద్దడంతో ఆకట్టుకుంది.
రేటింగ్: 3. 5 / 5
✍🏻. దాసరి మల్లేశ్