English | Telugu

చైతన్య-శోభిత డేటింగ్ పై సమంత కామెంట్స్ నిజమేనా?

నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకొని ఎవరి జీవితం వాళ్ళు బ్రతుకుతున్నారు. సినిమాలు, సిరీస్ లు అంటూ షూటింగ్ లతో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయినప్పటికీ వారి వ్యక్తిగత జీవితాలపై తరచూ ఏవో వార్తలు వస్తూనే ఉన్నాయి. సమంతతో విడిపోయిన నాగ చైతన్య.. మరో హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో డేటింగ్ లో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా వీరి డేటింగ్ పై సమంత సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే సమంత మాత్రం అసలు తానేం అనలేదని క్లారిటీ ఇచ్చింది.

"ఎవరు ఎవరితో రిలేషన్‌షిప్‌లో ఉన్నా నాకు ఇబ్బంది లేదు. ప్రేమకు విలువ ఇవ్వని వారు ఎంతమందితో డేటింగ్ చేసినా కన్నీళ్లే మిగులుతాయి. కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలి" అంటూ చైతన్య-శోభిత డేటింగ్ పై సమంత స్పందించినట్లు ఓ వెబ్ సైట్ రాసుకొచ్చింది. ఆ న్యూస్ గురించి ట్విట్టర్ వేదికగా స్పందించిన సమంత.. "నేనెప్పుడూ అలా అనలేదు" అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ ట్విట్టర్ లో వైరల్ గా మారింది. సమంత ఏం అనకపోయినా అన్నట్లుగా ఇలా తప్పుడు వార్తలు రాయడం ఏంటంటూ సమంత అభిమానులు, నెటిజన్లు మండిపడుతున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.