English | Telugu
ముందుగానే వచ్చేస్తున్న 'పుష్ప-2' టీజర్!
Updated : Apr 4, 2023
మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీలలో 'పుష్ప-2' ఒకటి. 'పుష్ప-1'తో పాన్ ఇండియా రేంజ్ లో ఘన విజయాన్ని అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప రెండో భాగంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే ఈ సినిమా నుంచి కాన్సెప్ట్ టీజర్, ఫస్ట్ లుక్ విడుదల కాబోతున్నాయి.
ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో ఆరోజు పుష్ప-2 కాన్సెప్ట్ టీజర్ విడుదల కానుందని ఇటీవల న్యూస్ వినిపించింది. అయితే ఇప్పుడు ఒకరోజు ముందుగానే ఈ టీజర్ రాబోతున్నట్లు వినికిడి. ఏప్రిల్ 7న పుష్ప-2 కాన్సెప్ట్ టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. సినిమా కాన్సెప్ట్ ని తెలిపేలా అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో ఈ టీజర్ ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ పుట్టినరోజు అయిన ఏప్రిల్ 8న ఈ మూవీ ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నారట. మొత్తానికి కాన్సెప్ట్ టీజర్, ఫస్ట్ లుక్ తో బన్నీ ఫ్యాన్స్ కి వెంటవెంటనే అదిరిపోయే గిఫ్ట్స్ రాబోతున్నాయన్నమాట.