English | Telugu
జనసేనాని మాకు చెప్పింది ఇదే..అందుకే ఆయనకు మేమిలా సపోర్ట్ చేస్తాం
Updated : Jul 28, 2023
జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో చేసిన కామెంట్స్ గురించి అందరికీ తెలుసు..జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఆయన తన ప్రసంగాలు చేస్తూ ఉంటారు. వాలంటీర్ వ్యవస్థ మీద కావొచ్చు, ఏపీలోని వృక్ష విలాపం గురించి కావొచ్చు, మహిళల మిస్సింగ్ కేసుల గురించి కావొచ్చు ఒక్కో సమావేశంలో ఒక్కో అంశాన్ని హైలైట్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్..అలాంటి పవన్ కళ్యాణ్ జనసేన ద్వారా ప్రజలకు ఎంతో కొంత మంచి చేయడానికి వచ్చానని చెప్తూ ఉన్నారు. అలాంటి మెగా ఫామిలీలో కుర్రాళ్ళు పాలిటిక్స్ లోకి రావాలి అంటే పవన్ కళ్యాణ్ ముందుగానే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారట. సాయి ధరమ్ తేజ్ దాని గురించి "నిఖిల్ తో నాటకాలు" షోలో చేసిన పాడ్ కాస్ట్ లో చెప్పారు.
"నేను మావయ్య ప్రసంగాలన్నీ డైలీ వింటాను. అప్ డేట్ ఉన్నాను ఆయన విషయంలో. కానీ ముందుగా చెప్పాలంటే నాకు పాలిటిక్స్ గురించి పెద్ద అవగాహన లేదు. ఐతే ఒక రోజు మావయ్య నన్ను, వైష్ణవ్ ని, వరుణ్ ని, చరణ్ ని పిలిచి చెప్పారు. ముందు మీరు ప్రజల ప్రాబ్లమ్స్ ని తెలుసుకోండి. స్టడీ చేయండి. అప్పుడు మీకు ఒక సొల్యూషన్ అనేది తెలుస్తుంది..అలా తెలుసుకున్నప్పుడు మాత్రమే మీరు పాలిటిక్స్ లోకి రండి అని చెప్పారు. కాబట్టి మేము ఎవరిమైనా కూడా సపోర్ట్ చేయాలి అనుకుంటే మాత్రం బయట నుంచే సపోర్ట్ చేస్తాం. మావయ్యకు మేనల్లుడిగా, ఒక శిష్యుడిగా ఏదైనా కావొచ్చు ఆయన వుండే విధానం నాకు చాలా నచ్చుతుంది. ప్రజల కోసం ఆయన ఫైట్ చేయడం మా అందరికీ బాగా నచ్చే విషయం.
మేము ఆయన కోసం ప్రచారం చేసి సపోర్ట్ చేస్తానంటే కుదరదు..ఆయన ఒప్పుకోరు. ఐతే ఆయన్ని వెనక్కి లాగే వాళ్ళు చాల మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డౌన్ లోనే ఉన్నారు కాబట్టి ఈయన్ని కిందకి దించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ అన్నిటినీ చూస్తూ ఉండడమే..మన పని మనం చేసుకుంటూ వెళ్లిపోవడమే..ఎక్కడో ఒకచోట వాళ్ళే మన దారికి వస్తారు. అప్పుడే తెలుస్తుంది మన బలం ఏమిటి అనేది" అని చెప్పారు సాయి ధరమ్ తేజ్.