English | Telugu
వెకేషన్ లో భర్తతో కలిసి అనసూయ రొమాంటిక్ పోజులు
Updated : Jul 28, 2023
యాంకర్ అనసూయ గురించి పెద్దగా చెప్పాల్సియా అవసరం లేదు. ఆమె బోల్డ్ అండ్ బ్యూటిఫుల్. బుల్లితెర ద్వారా తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. జబర్దస్త్ కామెడీ షో యాంకర్ గా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుని ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద బాగా ఫోకస్ పెట్టింది ఈ బ్యూటీ. డైరెక్టర్ సుకుమార్ మూవీ "రంగస్థలంలో" "రంగమ్మత్త" రోల్ అనసూయకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఆ మూవీతో అనసూయకు మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి. అలాగే రీసెంట్ గా సుకుమార్ డైరెక్షన్ లోనే వచ్చిన పుష్ప మూవీలో దాక్షయనిగా కనిపించి.. అలరించింది. అలాగే ఇప్పుడు " విమానం" మూవీలో ఒక ప్రాస్టిట్యూట్ రోల్ లో సముద్రఖనితో కలిసి నటించింది. ఈ పాత్రకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు సుకూమార్ డైరెక్షన్ లోనే .. పుష్ప 2 మూవీలో కూడా అనసూయ కనిపిస్తోంది. ఇవే కాదు ఇంకా ఇతర భాషల్లో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నట్లు చెప్పింది అనసూయ. సోషల్ మీడియాలో కూడా అప్ డేట్ గా ఉంటుంది.
అలాగే ఈ మధ్య షోరూమ్స్ ఓపెనింగ్ ఫంక్షన్స్ కి బాగా అటెండ్ అవుతోంది. ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికితే చాలు అనసూయ తన ఫ్యామిలీ ని తీసుకుని విదేశాలకు చెక్కేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె తన ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో టూర్ ని ఎంజాయ్ చేస్తోంది. యూఎస్ కి వెళ్లిన అనసూయ అక్కడ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ , ఘిరాడెల్లి స్క్వేర్ దగ్గర తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది."మనం పర్సనల్ గా ఒంటరిగా గడిపే సమయం కంటే ఫామిలీతో సమయం గడిపితే చాలా బెస్ట్" అంటూ ఒక కాప్షన్ పెట్టుకుంది. ఇక అనసూయ పోస్ట్ చేసిన ఈ ఫొటోస్ చూసి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలు చూసిన అనసూయ అభిమానులు... ఎంజాయ్ ది ట్రిప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వెకేషన్ లో తన భర్తతో కలిసి రొమాంటిక్ పోజులు ఇచ్చింది..ఇక అనసూయ సోషల్ మీడియాలో ఎలాంటి వివాదాల జోలికి కూడా వెళ్లడం లేదు. ఇక అలాంటి విషయాలను పట్టించుకోను అని గతంలో చెప్పేసింది.