English | Telugu

సమంతతో సెల్ఫీ దిగిన కోతి..ఎంత అదృష్టం అంటున్న నెటిజన్స్

మాయోసైటిస్ వ్యాధి కారణంగా సమంత ఏడాదిగా చాలా బాధపడుతోంది. ఇక ఇప్పుడు మూవీస్ కి బ్రేక్ ఇచ్చి ఒక సంవత్సరం పాటు రెస్ట్ తీసుకోవాలని డిసైడ్ అయ్యి ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేసి అందరికీ బై బై చెప్పేసింది. అలా ఇప్పుడు ఆమె తన హాలిడేస్ ఎంతో బాగా ఎంజాయ్ చేస్తోంది. ప్రకృతికి దగ్గరా ఉంటోంది సమంత. మూవీస్ కి దూరంగా ఉంటున్నా కూడా ఫాన్స్ కి మాత్రం దగ్గరగానే ఉంటోంది. తన లేటెస్ట్ అప్ డేట్స్ ని ఎప్పటికప్పుడు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూనే ఉంటోంది.

అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమంత ఖాళీ దొరికితే ఆధ్యాత్మిక భావనలు కలిగించే దేవాలయాలు, మెడిటేషన్ సెంటర్లు, టూరిస్ట్ స్పాట్స్ కి వెళ్తోంది. ఈషా ఫౌండేషన్ కి కూడా రీసెంట్ గానే వెళ్ళింది సమంత. అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ స్ట్రెస్ ని తగ్గించుకుంటూ ఆనందంగా ఉంటోంది. ఇక ఇప్పుడు రీసెంట్ గా తన ఫ్రెండ్ తో కలిసి బాలి వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ దిగిన ఫొటోస్ ని తన పేజీలో పోస్ట్ చేసింది. బాలిలోని మంకీ ఫారెస్ట్ కి వెళ్ళింది. అక్కడ నేచర్ ని, అందమైన లొకేషన్స్ ని కేప్చర్ చేసింది. అలాగే ఒక కోతితో కూడా క్యూట్ సెల్ఫీ ఒకటి దిగి పోస్ట్ చేసింది. ఆ ఫొటోస్ లో సమంత ఆనందం చూస్తుంటే మాములుగా లేదు. అవి చూసిన ఫ్యాన్స్ బాగా హ్యాపీగా ఫీలవుతున్నారు. ‘చాలా రోజుల తర్వాత సమంతను ఇంత హ్యాపీగా చూస్తున్నాం’, ‘అబ్బా ఆ కోతి ఎంత లక్కీ,సమంతతో కలిసి సెల్ఫీ దిగే అదృష్టం దొరికింది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఐతే సమంత ఫైనల్ గా నటించిన " ఖుషి" మూవీ మాత్రం సెప్టెంబర్ 1న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే సాంగ్స్ ద్వారా మూవీని బాగా ప్రమోట్ చేశారు. ఇక విజయ్, సమంత కెమిస్ట్రీ మూవీలో ఎలా హైలెట్ అవుతుందో చూడాలి. ఇకపోతే సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ ఎప్పుడు వస్తుందన్నది మాత్రం ఇంకా కన్ఫామ్ కాలేదు. దాదాపు సమంత నటించిన చాలా మూవీస్ మంచి హిట్ కొట్టాయి కానీ రీసెంట్ గా వచ్చిన శాకుంతలం మూవీ మాత్రం బిగ్ డిజాస్టర్ గా మిగిలిపోయింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.