English | Telugu
ప్రభాస్ కోసం రంగంలోకి దిగుతున్న కోహ్లి
Updated : Nov 14, 2023
సినిమాల్లో ప్రభాస్ రెబల్ స్టార్ అయితే క్రికెట్ లో విరాట్ కోహ్లి రెబల్ స్టార్. ప్రస్తుతం కోహ్లి వరల్డ్ కప్ మ్యాచ్ లతో బిజీ గా ఉన్నాడు. ప్రభాస్ తన కొత్త సినిమా సలార్ విడుదల విషయంలో బిజీ గా ఉన్నాడు. అలాంటిది ఇప్పుడు వీళ్లిద్దరికీ సంబంధించిన ఒక వార్త టోటల్ ఇండియానే ఒక ఊపు ఊపుతుంది.
ప్రభాస్ నటించిన సలార్ చిత్రం వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 22 న విడుదల అవుతుంది. దీంతో చిత్ర బృందం సలార్ ప్రమోషన్స్ లో వేగాన్ని పెంచింది . అందులో భాగంగా సలార్ ట్రైలర్ ఈ నెల 1 న అన్ని భాషల్లోను విడుదల కాబోతుంది. ఇప్పుడు ఈ ట్రైలర్ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL లో పాల్గొనే రాయల్ చాలెంజర్స్ బెంగుళూర్ టీం మెంబెర్స్ ద్వారా మేకర్స్ ప్రమోషన్ ని స్టార్ట్ చేసారు. విరాట్ కోహ్లి వెనక్కి తిరిగి ఉంటే విరాట్ జర్సీ మీద 18 డేస్ టూ గో అనే పిక్ తో సలార్ ట్రైలర్ రిలీజ్ పబ్లిసిటీ ని ఇప్పిస్తున్నారు .
సలార్ ప్రొడ్యూసర్స్ అయిన హోంబలే ఫిల్మ్స్ వారు తమ గత చిత్రమైన కేజిఎఫ్ 2 కి కూడా రాయల్ చాలెంజర్స్ టీం నుంచి ఇదే తరహా పబ్లిసిటీ ని ఇప్పించారు.ఇపుడు సలార్ కి కూడా అదే విధంగా రాయల్ ఛాలెంజర్ క్రికెట్ టీం ద్వారా పబ్లిసిటీ ఇప్పిస్తున్నారు. సో ఇక సలార్ హంగామా స్టార్ట్ అవ్వడంతో ప్రభాస్ ఫాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. అలాగే కింగ్ కోహ్లి ప్రభాస్ కోసం రంగంలోకి దిగడంతో ఇండియా వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ మంచి హుషారుతో ఉన్నారు.