English | Telugu
చిల్డ్రన్స్ డే స్పెషల్.. క్యూట్ పిక్ షేర్ చేసిన బన్నీ!
Updated : Nov 14, 2023
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబంతో గడపడానికి తగినంత సమయం కేటాయిస్తూ ఉంటాడు. ఏమాత్రం సమయం దొరికినా భార్యాపిల్లలతో సరదాగా గడుపుతాడు. ముఖ్యంగా పిల్లలు అయాన్, అర్హతో టైం స్పెండ్ చేస్తూ ఆ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంటాడు.
చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈరోజు(నవంబర్ 14న) తన ఫ్యామిలీతో దిగిన ఫొటోని షేర్ చేశాడు బన్నీ. ఆ పిక్ లో కూతురు అర్హని తల్లి స్నేహ హత్తుకొని ఉండగా, కొడుకు అయాన్ ని తండ్రి బన్నీ హత్తుకొని ముద్దాడుతున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్యూట్ ఫ్యామిలీ అంటూ నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు.
సినిమాల విషయానికొస్తే బన్నీ ప్రస్తుతం పుష్ప రెండో భాగంగా రూపొందుతోన్న 'పుష్ప: ది రూల్'లో నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి సుకుమార్ దర్శకుడు. ఈ చిత్రం 2024, ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.